iDreamPost
android-app
ios-app

Yuvraj Singh: ABDని అవమానిస్తూ.. యువరాజ్ కి సెహ్వాగ్ బర్త్ డే విషెస్!

  • Author Soma Sekhar Published - 03:49 PM, Tue - 12 December 23

యువరాజ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ABDని అవమానిస్తూ.. టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలిపాడు.

యువరాజ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ABDని అవమానిస్తూ.. టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలిపాడు.

  • Author Soma Sekhar Published - 03:49 PM, Tue - 12 December 23
Yuvraj Singh: ABDని అవమానిస్తూ.. యువరాజ్ కి సెహ్వాగ్ బర్త్ డే విషెస్!

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే తమ పేరును సువర్ణాక్షరాలతో వరల్డ్ క్రికెట్ పై లిఖించుకున్నారు. అందులో ఒకడు టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్. క్యాన్సర్ తో పోరాడి మరి భారతీయుల చిరకాల వాంఛ అయిన వరల్డ్ కప్ ను అందించాడు. 2011 ప్రపంచ కప్ లో అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవడమే కాకుండా.. టీమిండియా అభిమానుల మనసులను కూడా గెలుచుకున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈరోజు(డిసెంబర్ 12)న యువీ తన పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడికి సహచర ఆటగాళ్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో యువీకి బర్త్ డే విషెస్ చెప్పాడు. సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ను అవమానిస్తూ.. యువీకి విషెస్ తెలియజేశాడు.

యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే పేరు. 2011 వరల్డ్ కప్ లో అసాధారణ ప్రతిభతో జట్టుకు ప్రపంచ కప్ ను అందించాడు. ఓ వైపు క్యాన్సర్ బాధిస్తున్నా.. మెుక్కవోని ధైర్యంతో జట్టుకు కప్ ను అందించాడు. తాజాగా డిసెంబర్ 12న 42వ పడిలోకి అడుగుపెట్టాడు యువీ. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో యువీకి బర్త్ డే విషెస్ చెప్పాడు.

“హ్యాపీ బర్త్ డే యువరాజ్ సింగ్. నీ పుట్టినరోజు అనగానే అందరికి నువ్వు కొట్టిన 6 సిక్సర్లే గుర్తుకు వస్తాయి. కానీ ఈ రోజు ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు కూడా. ఇక ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది ఏబీసీడీలు(ఏబీ డివిలియర్స్ ను ఉద్దేశించి) వస్తూ ఉంటారు. కానీ నీలాంటి బ్యాటర్లు మాత్రం చాలా అరుదుగా వస్తారు” అంటూ బర్త్ డే విషెస్ చెప్పాడు వీరూ భాయ్. దీంతో ఏబీసీడీ అంటే ఏబీ డివిలియర్సే అని చాలా మంది క్రికెట్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. డివిలియర్స్ ను అవమానిస్తూ యువీకి విషెస్ చెప్పడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఏబీడీ అద్భుతమైన బ్యాటర్ అని, అతడిని ఇలా అవమానించడం సెహ్వాగ్ స్థాయికి తగదని కొంతమంది నెటిజన్లు రాసుకొస్తున్నారు. కాగా.. సెహ్వాగ్ మరోసారి తనలో ఉన్న చమత్కారాన్ని ఈ విషెస్ కు వాడాడు అంటూ ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి యువరాజ్ సింగ్ కు తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సెహ్వాగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.