iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన ఊతప్ప.. స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాడంటూ..!

  • Published Jul 20, 2024 | 6:21 PMUpdated Jul 20, 2024 | 6:21 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్​లో చూసిన సక్సెస్ అంతా ఇంతా కాదు. మోడర్న్ మాస్టర్ అనే బిరుదును దక్కించుకోవడమే గాక రెండు వరల్డ్ కప్​లు అందుకొని తన క్రికెట్ ప్రస్థానాన్ని మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్​లో చూసిన సక్సెస్ అంతా ఇంతా కాదు. మోడర్న్ మాస్టర్ అనే బిరుదును దక్కించుకోవడమే గాక రెండు వరల్డ్ కప్​లు అందుకొని తన క్రికెట్ ప్రస్థానాన్ని మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు.

  • Published Jul 20, 2024 | 6:21 PMUpdated Jul 20, 2024 | 6:21 PM
Virat Kohli: కోహ్లీ సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన ఊతప్ప.. స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాడంటూ..!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్​లో చూసిన సక్సెస్ అంతా ఇంతా కాదు. మోడర్న్ మాస్టర్ అనే బిరుదును దక్కించుకోవడమే గాక రెండు వరల్డ్ కప్​లు అందుకొని తన క్రికెట్ ప్రస్థానాన్ని మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. దశాబ్దంన్నరకు పైగా సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అసాధ్యమైన రికార్డులను తిరగరాశాడు విరాట్. అలాగే చాలా కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు కూడా. ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి అడుగు పెట్టిన తొలినాళ్లలోనే వన్డే వరల్డ్ కప్-2011 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు కోహ్లీ. ఆ తర్వాత క్రమంగా సీనియర్ ప్లేయర్​గా ఎదిగాడు. రోహిత్ శర్మతో కలసి టీమిండియాకు మూలస్తంభంగా ఉంటూ వచ్చిన కింగ్.. భారత్​కు మరో ప్రపంచ కప్ ట్రోఫీని అందించేందుకు శతవిధాలుగా ప్రయత్నించాడు. ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్-2024తో అతడి డ్రీమ్ నెరవేరింది.

సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో ఆటుపోట్లు వచ్చినా దేనికీ తలవంచకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చాడు కోహ్లీ. టీమ్​కు ఇంకో ఒకట్రెండు కప్పులు అందించే వరకు విశ్రమించకుండా పోరాడాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఫ్యాన్స్​తో పాటు యంగ్ క్రికెటర్స్ కూడా అతడ్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అదే టైమ్​లో అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటో కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత నిలకడగా ఇన్నేళ్ల పాటు రాణించడం వెనుక మ్యాజిక్ ఏంటా అని ఆలోచిస్తున్నారు. దీనిపై మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ వర్క్ ఎథిక్స్ పాటిస్తాడని.. అదే అతడ్ని ఈ స్థాయికి చేర్చిందని, అదే అతడి సక్సెస్ మంత్ర అని చెప్పాడు ఊతప్ప.

‘నేను విరాట్ కోహ్లీ పనితీరుకు బిగ్ ఫ్యాన్​ను. అతడు వర్క్ ఎథిక్స్ స్ట్రిక్ట్​గా ఫాలో అవుతాడు. కెరీర్ స్టార్టింగ్ డేస్ నుంచి విరాట్ అంతే. ఫిట్​నెస్, బ్యాటింగ్ ప్రాక్టీస్ విషయంలో అతడు ఎంతో కఠినంగా ఉంటాడు. ఇది నాకు ఇష్టం’ అని ఊతప్ప ప్రశంసించాడు. బ్యాటింగ్ సాధనతో పాటు ఎప్పటికప్పుడు కొత్త మెళకువలు నేర్చుకోవడం, తనను తాను మరింత సానబెట్టుకోవడంపై విరాట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడని పేర్కొన్నాడు. విరాట్ తనను తాను ఎంతో నమ్ముతాడని, ఒక పని అనుకుంటే అది పూర్తయ్యే వరకు ఊరుకోడని వ్యాఖ్యానించాడు. అతడిపై అతడికి ఉన్న నమ్మకమే ఈ రేంజ్​కు చేర్చిందన్నాడు. కెరీర్ మొదట్లో తమతో షేర్ చేసుకున్న ఒక్కో డ్రీమ్​ను అతడు చేరుకుంటూ వస్తున్నాడని ఊతప్ప వివరించాడు. వర్క్ ఎథిక్స్ విషయంలో అంత నిబద్ధతతో ఉంటే ఎవ్వరైనా సక్సెస్ అవ్వొచ్చన్నాడు. మరి.. కోహ్లీ సక్సెస్ సీక్రెట్​ ఇంకేదైనా ఉందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి