iDreamPost
android-app
ios-app

ఛీ.. ఛీ.. అతనితో ధోనికి పోలికేంటి? ఏం తాగావ్‌: హర్భజన్‌ సింగ్‌

  • Published Jul 20, 2024 | 2:23 PM Updated Updated Jul 20, 2024 | 2:23 PM

Harbhajan Singh, MS Dhoni: టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనితో ఆ క్రికెటర్‌కు పోలికేంటి అంటూ భారత మాజీ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Harbhajan Singh, MS Dhoni: టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనితో ఆ క్రికెటర్‌కు పోలికేంటి అంటూ భారత మాజీ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 20, 2024 | 2:23 PMUpdated Jul 20, 2024 | 2:23 PM
ఛీ.. ఛీ.. అతనితో ధోనికి పోలికేంటి? ఏం తాగావ్‌: హర్భజన్‌ సింగ్‌

ఇండియాలోనే కాదు ప్రపంచ క్రికెట్‌లోనే గొప్ప వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా మహేంద్ర సింగ్‌ ధోని పేరు తెచ్చుకున్నాడు. ఇక భారత క్రికెట్‌ చరిత్రలో ధోని గొప్ప వికెట్‌ కీపర్‌గా నిలిచిపోయాడు. అలాంటి ధోనితో ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ను పోల్చి.. ఇద్దరిలో ఎవరు బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఓ పోస్ట్‌ చూసి.. టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌కు చిర్రెత్తుకొచ్చినట్లు ఉంది. ఆ పోస్టుపెట్టిన ఫరీద్‌ ఖాన్‌ అనే అనే నెటిజన​్‌ను ఓ ఆట ఆడుకున్నాడు.

‘ఈ మధ్య ఏం స్మోక్‌ చేస్తున్నావ్‌.. ఇలాంటి సిల్లీ ప్రశ్నలు అడుతున్నావ్‌. ఇతనికి ఎవరైనా చెప్పండి.. రిజ్వాన్‌ కంటే ధోని ఎంతో ముందు ఉన్నాడని, ఆ విషయాన్ని రిజ్వాన్‌ను అడిగినా నిజాయితీ చెప్తాడు. రిజ్వాన్ కూడా మంచి ప్లేయర్‌, మంచి ఇంటెంట్‌తో ఆడతాడు. కానీ, ధోనితో పోల్చడం సరికాదు’ అంటూ హర్భజన్‌ పేర్కొన్నాడు. ఫరీద్‌ ఖాన్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో క్రికెట్‌కు సంబంధించిన అప్డేట్స్‌ పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే రిజ్వాన్‌, ధోని ఇద్దరిలో ఎవరు బెస్ట్‌ అంటూ ఒక ప్రశ్న వేశాడు.

గతంలో చాలా మంది ధోనితో పోల్చుకుని కనీసం ధోని సాధించిన దాంట్లో సగం కూడా సాధించలేకపోయారు. అలాగే టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో కూడా చాలా మంది పాకిస్థాన్‌ క్రికెటర్లను పోల్చేవాళ్లు. పాకిస్థాన్‌ టీమ్‌లోకి ఏ కొత్త ప్లేయర్‌ వచ్చినా.. అతను కాస్త బాగా ఆడితే చాలు వెంటనే విరాట్‌ కోహ్లీతో పోల్చడం స్టార్ట్‌ చేసేస్తారు. ఇప్పటికే కోహ్లీతో నలుగురు, ఐదుగురు ఆటగాళ్లను పోల్చారు. కానీ, ఎవరూ కూడా కోహ్లీకి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. అలాగే కొంతమందిని ధోనితో కూడా పోల్చారు. ఇప్పుడు ధోనితో రిజ్వాన్‌ను పోల్చడంపై కూడా టీమిండియా క్రికెట్‌ అభిమానులు నవ్వుకుంటున్నారు. మరి అలా పోల్చిన వ్యక్తికి హర్బజన్‌ సింగ్‌ ఇచ్చిన స్ట్రోక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.