iDreamPost

Virat Kohli: ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్న కోహ్లీ.. మెస్సీ, రొనాల్డోలను ఓడించి..!

  • Published Jan 01, 2024 | 9:17 AMUpdated Jan 01, 2024 | 5:01 PM

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నాడు. ఫుట్​బాల్ స్టార్ లియోనల్ మెస్సీని ఓడించి మరీ అతడు దీన్ని సొంతం చేసుకోవడం విశేషం.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నాడు. ఫుట్​బాల్ స్టార్ లియోనల్ మెస్సీని ఓడించి మరీ అతడు దీన్ని సొంతం చేసుకోవడం విశేషం.

  • Published Jan 01, 2024 | 9:17 AMUpdated Jan 01, 2024 | 5:01 PM
Virat Kohli: ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్న కోహ్లీ.. మెస్సీ, రొనాల్డోలను ఓడించి..!

టీమిండియా కీలక మ్యాచ్​కు రెడీ అవుతోంది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓడిపోయి నిరాశలో కూరుకుపోయిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్​లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్​లో నెగ్గి అభిమానులకు ఊరట కలిగించడంతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్​తో జరిగే సిరీస్​కు ముందు కాన్ఫిడెన్స్​ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. మొదటి టెస్టులో జరిగిన లోపాలను సరిదిద్దుకొని దీటుగా ఆడాలని చూస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్​లోకి రావాలని కోరుకుంటున్నాడు. ఫస్ట్ మ్యాచ్​లో అదరగొట్టిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదే ఫామ్​ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి తరునంలో కోహ్లీ ఫ్యాన్స్​కు జోష్​ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కింగ్ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఫుట్​బాల్ స్టార్స్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను ఓడించి ఒక పురస్కారాన్ని దక్కించుకున్నాడు విరాట్.

ప్రతిష్టాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డును సొంతం చేసుకున్నాడు కోహ్లీ. వరల్డ్​వైడ్​గా ఇన్​స్టాగ్రామ్​లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న పేజీల్లో ఒకటిగా ప్యూబిటీని చెప్పొచ్చు. ఈ పేజీని ఇన్​స్టాలో 35 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దీని అనుబంధ సంస్థ అయిన ప్యూబిటీ స్పోర్ట్స్ ఈ పురస్కారాలను అందిస్తోంది. 2023వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా పెర్ఫార్మ్ చేసిన ఆటగాళ్లు ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. అందులో 16 మంది నాకౌట్ రౌండ్స్​కు సెలక్ట్ అయ్యారు. ఈ లిస్ట్​లో విరాట్ కోహ్లీతో పాటు లియోనల్ మెస్సీ, నొవాక్ జొకోవిచ్, ప్యాట్ కమిన్స్‌, లెబ్రాన్ జేమ్స్, ఎర్లింగ్ హాలాండ్, క్రిస్టియానో రొనాల్డో, మ్యాక్స్ వెర్​స్టాపెన్ ఉన్నారు.

Kohli won the prestigious award!

ప్యుబిటీ స్పోర్ట్ అవార్డు కోసం ఆఖరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఎవరు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుస్తారనేది ఉత్కంఠ రేకెత్తించింది. దీని కోసం ఫైనల్ రౌండ్​లో కోహ్లీ, మెస్సీలు పోటీపడ్డారు. అయితే మెస్సీకి వరల్డ్​వైడ్​గా ఎంత క్రేజ్ ఉన్నా.. విరాట్ మేనియా, పాపులారిటీ ముందు అతడు నిలవలేకపోయాడు. ఫైనల్ ఓటింగ్స్​లో కింగ్ కోహ్లీకి ఏకంగా 78 శాతం ఓట్లు రాగా.. మెస్సీకి మాత్రం కేవలం 22 శాతం ఓట్లే వచ్చాయి. విరాట్​ ప్యూబిటీ ఆఫ్ ది ఇయర్ 2023ని దక్కించుకున్నాడు. దీంతో అందరూ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఫైనల్​లో వచ్చిన ఓట్లను బట్టి భారత స్టార్ బ్యాటర్ క్రేజ్ ఏ లెవల్​కు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది వన్డే వరల్డ్ కప్​తో పాటు మిగిలిన టోర్నమెంట్స్​లోనూ సూపర్ ఫామ్​ను కనబర్చిన విరాట్.. 2024లోనూ దాన్నే కొనసాగించాలని చూస్తున్నాడు. మరి.. మెస్సీని ఓడించి ప్రతిష్టాత్మక అవార్డును కోహ్లీ దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Australia: ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్స్​ అందించిన స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి