iDreamPost

Australia: ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్స్​ అందించిన స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్!

  • Published Jan 01, 2024 | 8:14 AMUpdated Jan 01, 2024 | 1:51 PM

ఒక స్టార్ క్రికెటర్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్స్​ అందించిన ఆ ప్లేయర్​ గుడ్​బై చెప్పడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

ఒక స్టార్ క్రికెటర్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్స్​ అందించిన ఆ ప్లేయర్​ గుడ్​బై చెప్పడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

  • Published Jan 01, 2024 | 8:14 AMUpdated Jan 01, 2024 | 1:51 PM
Australia: ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్స్​ అందించిన స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్!

ఆటగాళ్లు అన్నాక రిటైర్మెంట్ తీసుకోవడం అనేది సర్వసాధారణమే. ఎంతటి ప్లేయర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు రిటైర్మెంట్ తీసుకోక తప్పదు. శరీరం సహకరించినంత కాలం, ఫామ్​లో ఉన్నన్ని రోజులు ఆడతారు. ఆ తర్వాత గేమ్ నుంచి తప్పుకుంటారు. అయితే కొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకుంటే అభిమానులు, ప్రేక్షకులు తట్టుకోలేరు. ఇన్ని రోజులు అద్భుతమైన ఆటతీరుతో తమను ఇంతగా అలరించిన వారు తర్వాతి రోజు నుంచి గ్రౌండ్​లో కనబడరనే విషయం విని షాకవుతారు. రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకోవాలని కోరతారు. ఇక, క్రికెట్​లో గ్రేట్ ఓపెనర్స్​లో ఒకడిగా పేరు సంపాదించిన ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే టెస్టులకు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అతడు మరో షాకింగ్ డెసిజన్ తీసుకున్నాడు. వన్డే క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు వార్నర్.

టీమిండియాపై వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఈ తరుణమే గేమ్​కు ముగింపు పలకించేందుకు సరైన టైమ్​గా భావిస్తున్నట్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు వార్నర్. వన్డేల నుంచి తాను తప్పుకోవడం వల్ల కొత్తవారికి ఛాన్సులు లభిస్తాయని తెలిపాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్​కు ఈ డాషింగ్ ఓపెనర్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈవారం పాకిస్థాన్​తో జరగనున్న ఫైనల్ టెస్ట్​ మ్యాచ్​ వార్నర్ కెరీర్​లో ఆఖరిది కానుంది. అయితే, వన్డే రిటైర్మెంట్​పై డేవిడ్ భాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2025లో పాక్​లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్​ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే తాను రీఎంట్రీ ఇస్తానని చెప్పాడు. స్వదేశంలో జరిగే బిగ్​బాష్​ లీగ్​లో కంటిన్యూ అవుతానని స్పష్టం చేశాడు వార్నర్. టెస్టులతో పాటు వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంచైజీ లీగ్స్​లో ఆడేందుకు తనకు ఎక్కువ సమయం లభిస్తుందని పేర్కొన్నాడు. తన కెరీర్​ను తీర్చిదిద్దడంలో ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేసుకున్నాడు.

david warner announced his retirement

ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2023 వన్డే వరల్డ్ కప్​లో కంగారూ జట్టు కప్పు కొట్టడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సహా మొత్తంగా 528 రన్స్ చేశాడు. టీమ్​ నుంచి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్​గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ లాంటి సీనియర్ ప్లేయర్ విఫలమైనా వార్నర్ రాణించడంతో ప్రపంచ కప్​లో ఆ లోటు కనిపించలేదు. డేవిడ్ భాయ్ వన్డే కెరీర్ విషయానికొస్తే.. అతడు మొత్తంగా 161 మ్యాచులు ఆడి 6,932 పరుగులు చేశాడు. 45.3 యావరేజ్​తో రన్స్ చేశాడు. అతడి బెస్ట్ స్కోర్ 179. కెరీర్​లో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు బాదాడు. టెస్టులతో పాటు అనూహ్యంగా వన్డేల నుంచి కూడా వార్నర్ తప్పుకోవడంతో అతడి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. 2015, 2023 వన్డే వరల్డ్ కప్స్​ను ఆసీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వార్నర్​కు ఇంకొన్నాళ్లు ఆడే సత్తా ఉందని అంటున్నారు. మరి.. వార్నర్ వన్డే క్రికెట్​కు గుడ్​బై చెప్పడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Wasim Akram: PSL-IPL గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన పాక్‌ లెజెండ్‌ వసీం అక్రమ్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి