iDreamPost
android-app
ios-app

Virat Kohli: వాళ్లకు మద్దతుగా నిలవండి.. ఫ్యాన్స్​కు కోహ్లీ స్పెషల్ రిక్వెస్ట్!

  • Published Jul 15, 2024 | 7:33 PMUpdated Jul 15, 2024 | 7:33 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చిరకాల వరల్డ్ కప్ కల నిజమవడంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చిరకాల వరల్డ్ కప్ కల నిజమవడంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

  • Published Jul 15, 2024 | 7:33 PMUpdated Jul 15, 2024 | 7:33 PM
Virat Kohli: వాళ్లకు మద్దతుగా నిలవండి.. ఫ్యాన్స్​కు కోహ్లీ స్పెషల్ రిక్వెస్ట్!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చిరకాల వరల్డ్ కప్ కల నిజమవడంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. కెరీర్ మొదట్లోనే వన్డే ప్రపంచ కప్-2011ను ఒడిసిపట్టాడు కింగ్. అయితే ఆ తర్వాత మాత్రం మళ్లీ మెగా ట్రోఫీని అందుకోలేకపోయాడు. గత పదమూడు సంవత్సరాల్లో ప్రపంచ కప్​ కోసం ఎంతగానో ప్రయత్నించాడు. కానీ సెమీస్ లేదా ఫైనల్స్ వరకు వచ్చి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు టీమిండియా ఈసారి పొట్టి కప్పును పట్టేయడంతో కోహ్లీ డ్రీమ్ నెరవేరింది. మెగా టోర్నీ ఆసాంతం విఫలమైన అతడు.. ఫైనల్ మ్యాచ్​లో విన్నింగ్ నాక్​తో మెరిశాడు. వరల్డ్ కప్ విక్టరీని ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్న విరాట్.. విక్టరీ పరేడ్ ముగిశాక లండన్​కు వెళ్లిపోయాడు.

ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి లండన్​లో ఉన్న కోహ్లీ అభిమానులకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. దయచేసి వాళ్లకు మద్దతుగా నిలవాలని కోరాడు. పారిస్ ఒలింపిక్స్​ కోసం సన్నద్ధమవుతున్నారు భారత అథ్లెట్లు. ఈ నెల 26 నుంచి ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంరంభం స్టార్ట్ కానుంది. పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్​ కోసం ఎప్పటిలాగే ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్​తో భారత బృందం రెడీ అయింది. దీంతో మన దేశ అథ్లెట్లకు సపోర్ట్ చేయాలని ఓ వీడియోలో కోహ్లీ ఫ్యాన్స్​కు విజ్ఞప్తి చేశాడు. ఒకప్పుడు భారత్ అంటే పాముకాట్లు, ఏనుగుల దేశంగా భావించేవారని.. కానీ కాలక్రమేణా అంతా మారిపోయిందని కింగ్ తెలిపాడు. ఇప్పుడు మన దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్నాడు.

‘భారత్ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ జెట్ స్పీడ్​తో దూసుకెళ్తోంది. గ్లోబల్ టెక్ హబ్​గా పేరు గడించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా.. క్రికెట్, ఫిల్మ్ ఇండస్ట్రీ, స్టార్టప్ యూనికార్న్స్​తో పాటు పలు ఇతర రంగాల్లోనూ రయ్​మంటూ పరుగులు పెడుతోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ దేశం ఇంకా ఏదైనా సాధించాల్సినది ఉందంటే అది ఒలింపిక్స్ మెడల్స్ అనే చెప్పాలి. గతంలో కంటే ఈసారి మరిన్ని గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్​ను మన అథ్లెట్లు సాధించాలి. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు వెళ్తున్న అథ్లెట్లు ఫీల్డ్​లు, కోర్ట్స్, ట్రాక్స్, రింగ్స్​లో అడుగు పెట్టినప్పుడు భారత్ అంతా ఆసక్తిగా చూస్తుంది. సక్సెస్​కు అంగుళం దూరంలో ఉన్న వాళ్ల ముఖాలను గుర్తుకుతెచ్చుకోండి. గుడ్ లక్ ఇండియా’ అని ఆ వీడియోలో కోహ్లీ చెప్పుకొచ్చాడు. మరి.. ఈసారి ఒలింపిక్స్​లో మన దేశానికి మెడల్స్ పెరుగుతాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి