iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీపై వార్నర్ షాకింగ్ కామెంట్స్.. అతడు అక్కర్లేదంటూ..!

  • Author singhj Published - 10:05 PM, Sat - 2 December 23

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు అక్కర్లేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు అక్కర్లేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

  • Author singhj Published - 10:05 PM, Sat - 2 December 23
Virat Kohli: కోహ్లీపై వార్నర్ షాకింగ్ కామెంట్స్.. అతడు అక్కర్లేదంటూ..!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమి బాధలో ఉన్న అభిమానులకు ఊరటను కలిగిస్తూ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్​ను గెలుచుకుంది భారత్. ఐదు టీ20ల ఈ సిరీస్​లో వైజాగ్, తిరువనంతపురం టీ20ల్లో నెగ్గిన టీమిండియా.. ఆ తర్వాతి మ్యాచ్​లో మాత్రం ఓటమి పాలైంది. దీంతో సిరీస్​లో కీలకంగా మారిన నాలుగో టీ20లో ఎలాగైనా సిరీస్​ను సొంతం చేసుకోవాలని మన టీమ్ భావించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కంగారూలను చిత్తు చేసి సిరీస్​ను గెలవాలని అనుకుంది. అనుకున్నట్లుగానే ప్లాన్ చేసి రాయ్​పూర్​లో జరిగిన నాలుగో టీ20లో నెగ్గింది భారత్. ఈ సిరీస్​లో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇది పూర్తయిన వెంటనే అందరి ఫోకస్ సౌతాఫ్రికా సిరీస్​ వైపు మళ్లుతుంది.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లాగే సౌతాఫ్రికా సిరీస్​ కూడా ఎంతో క్లిష్టమైనదని చెప్పొచ్చు. అక్కడ సిరీస్ నెగ్గడం.. ముఖ్యంగా టెస్టుల్లో గెలవడం అంత ఈజీ కాదు. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచ కప్ కూడా ఉన్న నేపథ్యంలో సఫారీ టూర్​లో టెస్టులతో పాటు టీ20ల మీదా భారత్ స్పెషల్ ఫోకస్ చేయనుంది. ఈ పర్యటనకు వెళ్లే జట్లను ఇప్పటికే ప్రకటించింది బీసీసీఐ. ఈసారి మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించడం విశేషం. రోహిత్ శర్మను టెస్టులకు, కేఎల్ రాహుల్​ను వన్డేలకు, సూర్యకుమార్ యాదవ్​ను టీ20లకు సారథిగా ఎంపిక చేసింది బోర్డు. రోహిత్ శర్మతో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ మహ్మద్ షమీని కేవలం టెస్టులకు మాత్రమే సెలక్ట్ చేసింది.

రోహిత్​తో పాటు కోహ్లీ, షమీ రెస్ట్ కోరుకోవడంతో వారిని టెస్టులకు మాత్రమే ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే షమి గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. చీలమండ గాయం కారణంగా ముంబైలోని ఓ ఆర్థోపెడిక్ వద్ద సీనియర్ పేసర్ ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడట. దీంతో అతడు సఫారీ టూర్​కు వెళ్లేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ కెరీర్​పై చాలా ప్రశ్నలు, అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ బ్యాటర్ లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్​లో కంటిన్యూ అవుతాడా? లాంగ్ కెరీర్​ను ప్లాన్ చేసే ఉద్దేశంతో కేవలం టెస్టులకే పరిమితం అవుతాడా? లేదా వన్డేలు, టెస్టులు ఆడుతూ పొట్టి ఫార్మాట్​కు పూర్తిగా దూరం అవుతాడా? లాంటి చాలా క్వశ్చన్స్ అభిమానులకు నిద్రపోనివ్వలేదు.

సఫారీ టూర్​కు టెస్ట్ టీమ్​లో మాత్రమే అందుబాటులో ఉంటానన్న విరాట్.. రెస్ట్ తీసుకునే ఉద్దేశంతో టీ20లు, వన్డేల్లో ఆడనని చెప్పేశాడు. అయితే తర్వాతి సిరీస్​ల్లో అతడు ఆడతాడా? లేదా? కెరీర్​పై క్లారిటీ ఇస్తాడా? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్​లో కింగ్ ఆడతాడా? అనేది కూడా ఫ్యాన్స్​ మనసుల్ని తొలిచేస్తోంది. ఈ టైమ్​లో కోహ్లీ కెరీర్​పై ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2031 ప్రపంచ కప్​లో కోహ్లీ ఆడితే చూడాలని ఉందంటూ ఓ అభిమాని కోరుకున్నాడు. దీనికి డేవిడ్ భాయ్ అంతే ఇంట్రెస్టింగ్​గా రిప్లయ్ ఇచ్చాడు. ‘కోహ్లీని వద్దనడానికి రీజన్ కనిపించడం లేదు. అతడి ఫిట్​నెస్​ టాప్ లెవల్లో ఉంది. గేమ్​ను విరాట్ ఎంతగానో ప్రేమిస్తాడు’ అని వార్నర్ పోస్టు పెట్టాడు. టీమ్​లో అతడు అక్కర్లేదని అనడానికి కారణాలేవీ కనిపించడం లేదన్నాడు. నెట్టింట వార్నర్ పోస్ట్ వైరల్ అవుతోంది. మరి.. 2031 వరల్డ్ కప్​లోనూ కోహ్లీ ఆడతాడంటూ డేవిడ్ భాయ్ పెట్టిన పోస్టుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Mohammed Shami: షమి విషయంలో తప్పు చేస్తున్న BCCI.. డేంజర్​లో పేసర్ కెరీర్!