SNP
SNP
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. భారత తరఫున అలాంటి రికార్డును కేవలం ముగ్గురు క్రికెటర్లు మాత్రమే కలిగి ఉన్నారు. దిగ్గజ మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహేంద్రసింగ్ ధోని మాత్రమే 500లకి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. తాజాగా వెస్టిండీస్‌తో నేడు ప్రారంభం కానున్న రెండో టెస్టుతో విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. టెస్ట్, వన్డే, టీ20లు కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
తాజాగా కోహ్లీ 500 మార్క్ అందుకుంటున్న క్రమంలో ఈ మ్యాచ్ అతనికి ఎంతో ప్రత్యేకంగా మారింది. ఈ క్రమంలోనే కోహ్లీ మరో భారీ రికార్డును సైతం బద్దలుకొట్టనున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో 499 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి.. పాకిస్థాన్ దిగ్గజ మాజీ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్ 10వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ, ఇంజుమామ్‌ను వెనక్కి నెట్టి 10వ స్థానానికి చేరుకోనున్నాడు.
మొత్తంగా ఈ జాబితాలో టాప్ 10లో నలుగురు భారత క్రికెటర్లు ఉండటం విశేషం. 664 మ్యాచ్‌లతో సచిన్ నంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా.. జయవర్దనే(652), సంగార్కర(594), జయసూర్య(586), రికీ పాంటింగ్(560), ఎంఎస్ ధోని(538), షాహిద్ అఫ్రిదీ(524), జాక్వెస్ కల్లీస్(519), రాహుల్ ద్రావిడ్(509), ఇంజుమామ్ ఉల్ హక్(499), విరాట్ కోహ్లీ(499) ఉన్నారు. ఈ జాబితాలో టాప్ 20లో కూడా కోహ్లీ ఒక్కడే యాక్టివ్‌గా ఉన్నాడు. మిగతా వాళ్లు రిటైర్ అయిపోయారు. అయితే.. ఈ రోజు ప్రారంభం కానున్న టెస్ట్‌తో కోహ్లీ, ఇంజుమామ్‌ను దాటి 10వ స్థానానికి చేరుకుంటాడు. మరి కోహ్లీ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
500 reasons to admire the journey!
Congratulations to Virat Kohli on his 5️⃣0️⃣0️⃣th international match for #TeamIndia 🇮🇳🫡#WIvIND | @imVkohli pic.twitter.com/Y9lez80Q97
— BCCI (@BCCI) July 20, 2023
ఇదీ చదవండి: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన టీమిండియా క్రికెటర్! బిత్తరపోయిన పాక్ బ్యాటర్