iDreamPost

కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన టీమిండియా క్రికెటర్‌! బిత్తరపోయిన పాక్‌ బ్యాటర్‌

  • Published Jul 20, 2023 | 8:18 AMUpdated Jul 20, 2023 | 8:18 AM
  • Published Jul 20, 2023 | 8:18 AMUpdated Jul 20, 2023 | 8:18 AM
కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన టీమిండియా క్రికెటర్‌! బిత్తరపోయిన పాక్‌ బ్యాటర్‌

క్రికెట్‌లో బ్యాటర్లు చెలరేగి పరుగుల వరద పారిస్తేనో.. బౌలర్లు నిప్పులు చెరుగుతూ వికెట్లను టపటపా కూలిసిస్తేనో వచ్చే థ్రిల్‌ కంటే కూడా ఓ ఫీల్డర్‌ అద్బుతమైన క్యాచ్‌ పడితే కలిగే సంతోషమే వేరే. మన టీమ్‌కు చెందిన ఆటగాడు సెంచరీ చేస్తేనే, లేదా వికెట్‌ తీస్తేనే క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంతోష పడతారు. కానీ, ఫీల్డింగ్‌ అలా కాదు.. ప్రత్యర్థి టీమ్‌లోని ప్లేయర్‌ అయినా సరే ఓ సూపర్‌ క్యాచ్‌ పడితే.. ‘అబ్బ.. ఏం పట్టాడు రా’ అని అనుకుంటాం. ఫీల్డింగ్‌లో ఉండే మజా అదే.

అయితే తాజాగా మన భారత యువ క్రికెటర్‌ కనీవిని ఎరుగని రీతిలో ఓ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ చూస్తే ఒక్క క్షణం మీ కళ్లను మీరే నమ్మలేరు. అంత అద్భుతంగా ఉందా క్యాచ్‌. పైగా ఆ క్యాచ్‌ పట్టింది ఏం టీమ్‌ అనుకుంటున్నారు.. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై. ఆసియాలోని ఎమర్జింగ్‌ టీమ్స్‌ మధ్య జరుగుతున్న ఆసియా కప్‌ 2023 టోర్నీలో భాగంగా బుధవారం పాకిస్థాన్‌-ఏ టీమ్‌తో భారత-ఏ జట్టు తలపడింది. ఈ ‍మ్యాచ్‌లో టీమిండియా యువ సంచలనం హర్షిత్‌ రాణా అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.

హంగార్గేకర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌ 4వ బంతిని పాక్‌ బ్యాటర్‌ ఖాసీం అక్రమ్‌ థర్డ్‌ మ్యాన్‌ దిశగా భారీ కట్‌ షాట్‌ ఆడాడు. వేగంగా దూసుకెళ్తున్న ఆ బంతని హర్షిత్‌ రాణా అమాంతం గాల్లోకి అంతెత్తున లేని.. రెప్పపాటులో సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ చూసి అక్రమ్‌ కళ్లు తేలేశాడు. కచ్చితం బౌండరీ వస్తుందనుకున్న బంతికి అవుట్‌ అవ్వడంతో బిత్తరపోయాడు. అప్పటికే అతను 48 పరుగులతో అద్భుతంగా ఆడుతున్నాడు. అతన్ని ఔట్‌ చేయడంతో చివర్లో పాక్‌ స్కోర్‌ను కట్టడి చేయగలిగింది ఇండియా. ఈ సూపర్‌ క్యాచ్‌తో పాటు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో హర్షిత్‌ పట్టిన క్యాచ్‌ వీడియో కింద ఉంది. చూసి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్ 2023 షెడ్యూల్ రిలీజ్! భారత్, పాక్ తలపడేది ఆ రోజే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి