SNP
Virat Kohli, Sachin Tendulkar, IND vs BAN: కింగ్ విరాట్ కోహ్లీ.. ఓ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. బంగ్లాతో గురువారం ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌లోనే ఆ క్రేజీ రికార్డ్ సాధించే ఛాన్స్ ఉంది. మరి ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, Sachin Tendulkar, IND vs BAN: కింగ్ విరాట్ కోహ్లీ.. ఓ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. బంగ్లాతో గురువారం ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌లోనే ఆ క్రేజీ రికార్డ్ సాధించే ఛాన్స్ ఉంది. మరి ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. గురువారం నుంచి చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు చెన్నై చేరుకొని.. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. రోహిత్ సేన చాలా గ్యాప్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతుంటే.. మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం పాకిస్థాన్‌ను వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి.. రెట్టించిన ఉత్సాహంతో భారత్‌తో సమరానికి సిద్ధమవుతోంది. బంగ్లాను అడ్డుకొని ముక్కుతాడు వేసేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా సిద్ధంగానే ఉన్నారు. అలాగే ఈ సిరీస్‌తో కోహ్లీ ఓ వరల్డ్ రికార్డ్ సాధించే అవకాశం ఉంది.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసి.. సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నాడు కోహ్లీ. అందుకు కేవలం 58 పరుగుల దూరంలోనే ఉన్నాడు కింగ్. రెండు టెస్టుల సిరీస్‌లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లు కలిసి.. జస్ట్ 58 పరుగులు చేయడం అంత కష్టమేమీ కాదు. అందుకే ఈ సిరీస్‌లోనే కోహ్లీ వరల్డ్ రికార్డు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 58 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని.. అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా కోహ్లీ కొత్త చరిత్ర సృష్టిస్తాడు. గతంలో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 27 వేల పరుగులు చేసిన ప్లేయర్లు ముగ్గురు ఉన్నారు. అందులో సచిన్ ఒకడు. బంగ్లాపై 56 పరుగులు చేస్తే ఆ మైలురాయిని అందుకోబోయే నాలుగో బ్యాటర్‌గా విరాట్ నిలుస్తాడు.
సచిన్ టెండూల్కర్ కంటే ఫాస్ట్‌గా 27 వేల పరుగుల మైల్‌స్టోన్‌ను కోహ్లీ అందుకోనుండటం ఇక్కడ విశేషం. సచిన్ 623 ఇన్నింగ్స్‌లు ఆడి 27 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అందులో 226 టెస్ట్‌లు, 396 వన్డే ఇన్నింగ్స్‌లు, ఒక టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ మాత్రం 591 ఇన్నింగ్స్‌ల్లోనే 26,942 పరుగులు చేశాడు. మరో 58 పరుగులు చేస్తే 27 వేల రన్స్ పూర్తవుతాయి. ఆ 58 పరుగులు ఒక్క ఇన్నింగ్స్‌లోనే కొట్టేస్తే.. 592 ఇన్నింగ్స్‌ల్లోనే 27 వేల పరుగులు మైల్‌స్టోన్‌ను అందుకొని.. 600 ఇన్నింగ్స్‌ల లోపలే 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే 27 వేల కంటే ఎక్కువ రన్స్ చేశాడు.
సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌లు, 782 ఇన్నింగ్స్‌లు ఆడి 34,357 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో 30 వేల పైచిలుకు పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ ఒక్కడే. అతని తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 594 మ్యాచ్‌లు, 666 ఇన్నింగ్స్‌ల్లో 28,016 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 560 మ్యాచ్‌లు, 668 ఇన్నింగ్స్‌ల్లో 27,483 పరుగులు చేశాడు. వారి తర్వాత.. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ కేవలం 533 మ్యాచ్‌లు, 591 ఇన్నింగ్స్‌ల్లోనే 26,942 పరుగులు సాధించాడు. మరి.. బంగ్లాతో తొలి టెస్టులోనే కోహ్లీ 27 వేల పరుగుల మైలురాయి చేరుకుంటాడని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli is just 58 runs away from becoming the fastest batter to reach 27,000 runs in international cricket. pic.twitter.com/669ZPKILIU
— CricTracker (@Cricketracker) September 17, 2024