iDreamPost
android-app
ios-app

వీడియో: విరాట్‌ కోహ్లీ వర్సెస్‌ లబుషేన్‌! వీళ్లిద్దరి మధ్య గొడవేంటి?

  • Published Nov 19, 2023 | 8:45 PM Updated Updated Nov 19, 2023 | 8:45 PM

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ, ఆసీస్‌ క్రికెటర్‌ మార్నస్‌ లబుషేన్‌ మధ్య సైలెంట్‌ వార్‌ నడించింది. అసలు వాళ్లిద్దరి మధ్య గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ, ఆసీస్‌ క్రికెటర్‌ మార్నస్‌ లబుషేన్‌ మధ్య సైలెంట్‌ వార్‌ నడించింది. అసలు వాళ్లిద్దరి మధ్య గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 19, 2023 | 8:45 PMUpdated Nov 19, 2023 | 8:45 PM
వీడియో: విరాట్‌ కోహ్లీ వర్సెస్‌ లబుషేన్‌! వీళ్లిద్దరి మధ్య గొడవేంటి?

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడం వారికి కలిసొచ్చింది. పిచ్‌ పరిస్థితులు బ్యాటింగ్‌కు కష్టంగా ఉండటంతో టీమిండి​యా బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. అందుకు తగ్గట్లు ఆసీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా కేవలం 240 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. రోహిత్‌ శర్మ 47, విరాట్‌ కోహ్లీ 54, కేఎల్‌ రాహుల్‌ 66 మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. పిచ్‌ పరిస్థితులు, ఆసీస్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేక విఫలం అయ్యారు. ఇక 241 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలో ఇబ్బంది పడినా.. తర్వాత పుంజుకుని ఆడింది. ట్రావిస్‌ హెడ్‌-లబుషేన్‌ మంచి భాగస్వామ్యంతో ఆసీస్‌ను గేమ్‌లోకి తీసుకొచ్చారు.

అయితే ఇదే క్రమంలో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ-లబుషేన్‌ మధ్య కాస్త వాడీవేడి వాతావరణం కనిపించింది. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ అలాగే నడిచారు. ప్రస్తుతం వీళ్లిద్దరి ఐ వార్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు కానీ, గొడవ కానీ, జరగలేదు. అయినా కూడా ఇద్దరు అలా గొప్పగా చూసుకోవడం గమనార్హం. కాగా, అప్పటికే ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండటంతో కొత్త బ్యాటర్‌ లబుషేన్‌ను కాస్త ఒత్తిడిలో పెట్టేందుకే కోహ్లీ అలా చేసి ఉంటాడని చాలా మంది క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.