iDreamPost
android-app
ios-app

Virat Kohli: ఆ ఒక్క బౌలర్ తోనే విరాట్ కోహ్లీకి ముప్పు! అధిగమించకపోతే కష్టమే..

  • Published Sep 18, 2024 | 2:15 PM Updated Updated Sep 18, 2024 | 2:15 PM

Virat Kohli tough fight with Mehidy Hasan Miraz: బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఆ ఒక్క బౌలర్ తో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ముప్పు ఉందట. అతడి బౌలింగ్ ను కోహ్లీ అధిగమించకపోతే.. కష్టాలు తప్పవంటున్నారు క్రికెట్ లవర్స్.

Virat Kohli tough fight with Mehidy Hasan Miraz: బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఆ ఒక్క బౌలర్ తో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ముప్పు ఉందట. అతడి బౌలింగ్ ను కోహ్లీ అధిగమించకపోతే.. కష్టాలు తప్పవంటున్నారు క్రికెట్ లవర్స్.

Virat Kohli: ఆ ఒక్క బౌలర్ తోనే విరాట్ కోహ్లీకి ముప్పు! అధిగమించకపోతే కష్టమే..

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ పైనే క్రికెట్ అభిమానుల దృష్టి ఉంది. ఎందుకంటే? ఇటీవలే పాకిస్థాన్ జట్టును వారి సొంత గడ్డపైనే రెండు టెస్టుల్లో దారుణంగా ఓడించింది బంగ్లా. పైగా గత కొంత కాలంగా ఆ టీమ్ ఫర్పామెన్స్ కూడా అద్బుతంగా ఉంది. ఇక ఇదే ఆటతీరును టీమిండియాపై కూడా చూపించి.. షాకివ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నెలన్నర విశ్రాంతి తర్వాత టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ను మెుదలుపెట్టారు. ఇక భారత ప్లేయర్ల ప్రాక్టీస్ బట్టే తెలుస్తోంది బంగ్లాను టీమిండియా అంత ఈజీగా తీసుకోలేదని. ఈ క్రమంలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి బంగ్లాకు చెందిన ఆ బౌలర్ తో ముప్పు ఉన్నట్లు క్రికెట్ అనలిస్టులతో పాటు క్రికెట్ లవర్స్ అనుకుంటున్నారు.

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. తన బ్యాట్ తో పరుగుల సునామీ సృష్టిస్తూ, రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. ఇక విరాట్ క్రీజ్ లో ఉంటే ఎంతటి బౌలర్ కైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అయితే విరాట్ స్పిన్ ఆడటంలో తడబడుతున్నాడని, అతడికి స్పిన్ బౌలింగ్ బాగా ఆడరాదని కొంత కాలంగా కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ విమర్శలకు ఎప్పటికప్పుడు ఆన్సర్ ఇస్తూనే వస్తున్నాడు రన్ మెషిన్. కాగా.. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీకి ఆ ఒక్క బౌలర్ తో డేంజర్ తప్పకపోవచ్చు అంటున్నారు క్రికెట్ అనలిస్ట్ లు, ప్రముఖులు. ఆ బౌలర్ ఎవరో కాదు.. మెహిదీ హసన్ మిరాజ్. రైట్ ఆర్మ్ హాఫ్ బ్రేక్ బౌలర్ అయిన ఇతడితో కోహ్లీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మెహిదీ హసన్ మిరాజ్.. బంగ్లా టీమ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్. ఆఫ్ స్పిన్నర్ అయిన హసన్ తన బౌలింగ్ తో ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టడంలో సిద్ధహస్తుడు. ఇక ఇటీవలే జరిగిన పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించి.. సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఇతడితో విరాట్ కోహ్లీకి ముప్పుపొంచి ఉందని అందరూ అనుకుంటున్నారు. ఇతడిని ఎదుర్కోవడంలో నిజంగానే కోహ్లీ ఇబ్బంది పడితే.. అతడిని అధిగమించకపోతే.. టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మెహదీ హసన్ తో ఫైట్ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ మాత్రం కోహ్లీకి మద్ధతుగా నిలిచారు. కోహ్లీకి స్పిన్ ఆడటం రాదన్న వాదనను తోసిపుచ్చారు. మెహిదీ హసన్ ను అతడు అలవోకగా ఎదుర్కొంటాడని చెప్పుకొచ్చాడు. కాగా.. హసన్ మిరాజ్ 45 టెస్టుల్లో 3.11 ఎకానమీతో 174 వికెట్లు తీశాడు. మరి నిజంగానే మెహిదీ హసన్ తో విరాట్ కోహ్లీకి ముప్పు ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో  తెలియజేయండి.