Somesekhar
ఆఫ్గానిస్తాన్ తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.
ఆఫ్గానిస్తాన్ తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.
Somesekhar
టీమిండియా-ఆఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 11(గురువారం)న తొలి మ్యాచ్ కు మెుహాలీలోని IS బింద్రా మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ తొలి టీ20 మ్యాచ్ కు దూరం కానున్నాడు. దీంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. మరి కోహ్లీ తర్వాతి మ్యాచ్ లు అయినా ఆడతాడా? లేదా? అసలు కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ కు దూరం కావడానికి రీజన్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆఫ్గానిస్తాన్ తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చారు సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత కనీసం ఒక్క పొట్టి మ్యాచ్ కూడా వీరిద్దరు ఆడలేదు. దీంతో వీరి టీ20 కెరీర్ పై నీలినీడలు ఏర్పడ్డాయి. ఇలాంటి టైమ్ లో రోహిత్, కోహ్లీలను ఆఫ్గాన్ తో టీ20 సిరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ. ఇదిలా ఉండగా.. ఆఫ్గాన్ తో తొలి మ్యాచ్ కు టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. పర్సనల్ కారణాలతో అతడు ఫస్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు.
అయితే అతడు తర్వాతి మ్యాచ్ లకు జట్టుతో కలుస్తాడని తెలుస్తోంది. జనవరి 11, 14, 17 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. కోహ్లీ తొలి మ్యాచ్ కు దూరం కావడంతో.. టీమిండియాకు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఈ స్టార్ బ్యాటర్. దీంతో ఈ సిరీస్ లో ఆఫ్గాన్ బౌలింగ్ ను తుత్తునీయలు చేస్తూ.. జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తాడని ఫ్యాన్స్ భావించాడు. ఈ నేపథ్యంలో ఇలా జరగడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. మరి కోహ్లీ తొలి టీ20కి దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli will miss the first T20I against Afghanistan due to personal reasons.
– He will play the 2nd & 3rd T20I. pic.twitter.com/UvCRPYVyob
— Johns. (@CricCrazyJohns) January 10, 2024