వీడియో: కన్నడలో మాట్లాడిన కోహ్లీ.. బ్యాటింగే కాదు డైలాగ్​ డెలివరీలోనూ కింగే!

కింగ్ కోహ్లీ తనలోని మరో టాలెంట్​ను బయటపెట్టాడు. బ్యాటింగ్​లోనే కాదు.. డైలాగ్ డెలివరీలోనూ తాను తోపు అని ప్రూవ్ చేశాడు. కన్నడలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు విరాట్.

కింగ్ కోహ్లీ తనలోని మరో టాలెంట్​ను బయటపెట్టాడు. బ్యాటింగ్​లోనే కాదు.. డైలాగ్ డెలివరీలోనూ తాను తోపు అని ప్రూవ్ చేశాడు. కన్నడలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు విరాట్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్​బాక్స్ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి ఈ ప్రోగ్రామ్ ఘనంగా జరిగింది. ఇదే కార్యక్రమంలో ఆర్సీబీ కొత్త జెర్సీని ఆవిష్కరించారు. అలాగే ఈ సీజన్​కు కెప్టెన్​గా ఫాఫ్ డుప్లెసిస్​ను కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విమెన్స్ ప్రీమియర్ లీగ్​-2024 టైటిల్ నెగ్గిన ఆర్సీబీ విమెన్స్ టీమ్​ను సత్కరించారు. మెన్స్ టీమ్ ప్లేయర్లు అందరూ గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి స్మృతి సేనకు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పారు. ఆ సమయంలో ప్రేక్షకులు అంతా లేచి నిలబడి చప్పట్లు, విజిల్స్ కొడుతూ అభినందించారు. ఈ ప్రోగ్రామ్​లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాడు. అతడు కన్నడలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఆర్సీబీ అన్​బాక్స్ ఈవెంట్​కు ఒక రోజు ముందే ఇండియాలో ల్యాండ్ అయ్యాడు కోహ్లీ. భార్య అనుష్క శర్మకు డెలివరీ వల్ల కొన్నాళ్లు లండన్​లో ఉండిపోయిన ఈ మోడ్రన్ మాస్టర్.. ఐపీఎల్-2024 కోసం రీసెంట్​గా బెంగళూరుకు విచ్చేశాడు. అన్​బాక్స్ ఈవెంట్​ కోసం చిన్నస్వామి స్టేడియానికి టీమ్ బస్సులో వచ్చాడు కోహ్లీ. అతడ్ని చూడగానే అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గ్రౌండ్​లో విరాట్ అడుగు పెట్టగానే.. ‘కోహ్లీ కోహ్లీ’ అంటూ గట్టిగా అరిచారు. స్మృతి సేనకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చిన కింగ్.. ఆ తర్వాత సహచరులతో కలసి నవ్వుతూ జాలీగా కనిపించాడు. అనంతరం అతడ్ని స్టేజ్​ పైకి పిలిచారు. ఈ క్రమంలో అతడు కన్నడలో మాట్లాడి అందర్నీ షాక్​కు గురిచేశాడు. ‘ఇది ఆర్సీబీకి కొత్త అధ్యాయం’ అని కన్నడలో చెప్పుకొచ్చాడు కింగ్.

‘ఈ సాలా కప్ నమ్దే’ లాంటి ఒకటి అరా కన్నడ డైలాగులు కోహ్లీ గతంలో చెప్పాడు. ఈసారి కూడా మంచి డైలాగ్​తో అలరించాడు. ‘ఇదు ఆర్సీబీ యా హోస అధ్యాయ’ అని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పాడు. దీనర్థం.. ఆర్సీబీకి కొత్త ఛాప్టర్ మొదలైంది అని. విరాట్ డైలాగ్ వినగానే స్టేడియంలోని అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. క్లాప్స్ కొడుతూ విరాట్​ను మరింత ఉత్సాహపరిచారు. కోహ్లీ కన్నడలో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. బ్యాటింగ్​లోనే కాదు, డైలాగ్ డెలివరీలోనూ అతడు కింగే అని కామెంట్స్ చేస్తున్నారు. కొత్త హెయిర్ స్టైల్, చెరగని స్మైల్, ఫుల్ ఫిట్​నెస్​తో విరాట్ రీఫ్రెషింగ్​గా కనిపిస్తున్నాడని.. ఈసారి అతడ్ని ఆపడం ప్రత్యర్థుల వల్ల కాదని చెబుతున్నారు. మరి.. కోహ్లీ కన్నడ స్లాంగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments