Nidhan
కింగ్ కోహ్లీ తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టాడు. బ్యాటింగ్‌లోనే కాదు.. డైలాగ్ డెలివరీలోనూ తాను తోపు అని ప్రూవ్ చేశాడు. కన్నడలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు విరాట్.
కింగ్ కోహ్లీ తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టాడు. బ్యాటింగ్‌లోనే కాదు.. డైలాగ్ డెలివరీలోనూ తాను తోపు అని ప్రూవ్ చేశాడు. కన్నడలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు విరాట్.
Nidhan
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్‌బాక్స్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి ఈ ప్రోగ్రామ్ ఘనంగా జరిగింది. ఇదే కార్యక్రమంలో ఆర్సీబీ కొత్త జెర్సీని ఆవిష్కరించారు. అలాగే ఈ సీజన్‌కు కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌ను కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 టైటిల్ నెగ్గిన ఆర్సీబీ విమెన్స్ టీమ్‌ను సత్కరించారు. మెన్స్ టీమ్ ప్లేయర్లు అందరూ గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి స్మృతి సేనకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ఆ సమయంలో ప్రేక్షకులు అంతా లేచి నిలబడి చప్పట్లు, విజిల్స్ కొడుతూ అభినందించారు. ఈ ప్రోగ్రామ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అతడు కన్నడలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌కు ఒక రోజు ముందే ఇండియాలో ల్యాండ్ అయ్యాడు కోహ్లీ. భార్య అనుష్క శర్మకు డెలివరీ వల్ల కొన్నాళ్లు లండన్‌లో ఉండిపోయిన ఈ మోడ్రన్ మాస్టర్.. ఐపీఎల్-2024 కోసం రీసెంట్గా బెంగళూరుకు విచ్చేశాడు. అన్‌బాక్స్ ఈవెంట్ కోసం చిన్నస్వామి స్టేడియానికి టీమ్ బస్సులో వచ్చాడు కోహ్లీ. అతడ్ని చూడగానే అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గ్రౌండ్లో విరాట్ అడుగు పెట్టగానే.. ‘కోహ్లీ కోహ్లీ’ అంటూ గట్టిగా అరిచారు. స్మృతి సేనకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చిన కింగ్.. ఆ తర్వాత సహచరులతో కలసి నవ్వుతూ జాలీగా కనిపించాడు. అనంతరం అతడ్ని స్టేజ్ పైకి పిలిచారు. ఈ క్రమంలో అతడు కన్నడలో మాట్లాడి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ‘ఇది ఆర్సీబీకి కొత్త అధ్యాయం’ అని కన్నడలో చెప్పుకొచ్చాడు కింగ్.
‘ఈ సాలా కప్ నమ్దే’ లాంటి ఒకటి అరా కన్నడ డైలాగులు కోహ్లీ గతంలో చెప్పాడు. ఈసారి కూడా మంచి డైలాగ్‌తో అలరించాడు. ‘ఇదు ఆర్సీబీ యా హోస అధ్యాయ’ అని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పాడు. దీనర్థం.. ఆర్సీబీకి కొత్త ఛాప్టర్ మొదలైంది అని. విరాట్ డైలాగ్ వినగానే స్టేడియంలోని అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. క్లాప్స్ కొడుతూ విరాట్‌ను మరింత ఉత్సాహపరిచారు. కోహ్లీ కన్నడలో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. బ్యాటింగ్‌లోనే కాదు, డైలాగ్ డెలివరీలోనూ అతడు కింగే అని కామెంట్స్ చేస్తున్నారు. కొత్త హెయిర్ స్టైల్, చెరగని స్మైల్, ఫుల్ ఫిట్నెస్తో విరాట్ రీఫ్రెషింగ్‌గా కనిపిస్తున్నాడని.. ఈసారి అతడ్ని ఆపడం ప్రత్యర్థుల వల్ల కాదని చెబుతున్నారు. మరి.. కోహ్లీ కన్నడ స్లాంగ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Virat Kohli speaking Kannada.
– “THE NEW CHAPTER OF RCB” 👑pic.twitter.com/KQWk4Wdab8
— Johns. (@CricCrazyJohns) March 19, 2024