iDreamPost
android-app
ios-app

కోహ్లీ, షమీ, అయ్యర్ హెడ్ లైన్స్ లో ఉంటారు.. కానీ అతడే టీమిండియా రియల్ హీరో: దిగ్గజ క్రికెటర్

  • Author Soma Sekhar Published - 08:41 AM, Fri - 17 November 23

టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలు హెడ్ లైన్స్ లో ఉంటారని, కానీ రియల్ హీరో మాత్రం అతడేనని చెప్పుకొచ్చాడు ఈ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.

టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలు హెడ్ లైన్స్ లో ఉంటారని, కానీ రియల్ హీరో మాత్రం అతడేనని చెప్పుకొచ్చాడు ఈ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.

  • Author Soma Sekhar Published - 08:41 AM, Fri - 17 November 23
కోహ్లీ, షమీ, అయ్యర్ హెడ్ లైన్స్ లో ఉంటారు.. కానీ అతడే టీమిండియా రియల్ హీరో: దిగ్గజ క్రికెటర్

ప్రపంచ కప్ లో తిరుగులేని విజయాలతో ఫైనల్లోకి అడుగుపెట్టింది టీమిండియా. అపజయం అంటూ ఎరుగని జట్టుగా వరల్డ్ కప్ ను ముద్దాడేందుకు ఇంకా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇక నవంబర్ 19 ఆదివారం నాడు టైటిల్ పోరులో ఆసీస్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ నాజర్ హుస్సేన్. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలు హెడ్ లైన్స్ లో ఉంటారని, కానీ టీమిండియా రియల్ హీరో మాత్రం అతడేనని చెప్పుకొచ్చాడు ఈ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్. మరి నాజర్ హుస్సేన్ చెప్పిన ఆ రియల్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించిన భారత జట్టుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. వరల్డ్ వైగా ఉన్న క్రికెట్ దిగ్గజాలతో పాటుగా, క్రికెట్ అభిమాను కూడా టీమిండియా ప్లేయర్లను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. స్కై స్పోర్ట్స్ తో అతడు మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ లు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో మ్యాచ్ ముగిసిన వెంటనే హెడ్ లైన్స్ లో వీరి పేర్లు ఉంటాయి.

“కానీ టీమిండియా రియల్ హీరో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మనే. అతడు జట్టు రూపురేఖలే మార్చేశాడు. రోహిత్ ఆరంభం నుంచే దాటిగా ఆడుతూ.. జట్టుకు అదిరిపోయే స్కోర్ అందిస్తున్నాడు. ఇటు బ్యాటర్ గా అటు సారథిగా రోహిత్ భారత టీమ్ ను నడుపుతున్న తీరు అమోఘం” అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్. కాగా.. వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఆసీస్ ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఆదివారం (నవంబర్ 19)న ఫైనల్ పోరులో ఢీకొనబోతున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఆసీస్ ను ఓడించి ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి