Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఓ భారత మాజీ క్రికెటర్ ఒక సలహా ఇచ్చాడు. పంత్ కోసం కింగ్ త్యాగం చేయాలని అన్నాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఓ భారత మాజీ క్రికెటర్ ఒక సలహా ఇచ్చాడు. పంత్ కోసం కింగ్ త్యాగం చేయాలని అన్నాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో రోహిత్ సేన అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా.. ఇంకో మ్యాచ్ ఉండగానే సూపర్-8కు అర్హత సాధించింది. దీంతో కెనడాతో జరిగే లాస్ట్ లీగ్ మ్యాచ్ నామమాత్రం కానుంది. గత మూడు మ్యాచుల్లోనూ బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనిపించింది. అయితే బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా సహా ఇతర బౌలర్లు రఫ్ఫాడించడంతో జట్టుకు ఎదురు లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ సాధిస్తున్నా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. కింగ్ తిరిగి ఫామ్‌ను అందుకుంటాడా? లేదా? అనేది అందర్నీ టెన్షన్ పెడుతోంది. మున్ముందు సూపర్-8తో పాటు నాకౌట్ స్టేజ్ కూడా ఉండటంతో కోహ్లీ ఎలా ఆడతానేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ విషయంపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ రియాక్ట్ అయ్యాడు.
కోహ్లీ త్వరగా గాడిన పడాల్సిన అవసరం ఉందన్నాడు శ్రీశాంత్. అతడు ఫామ్‌ను అందిపుచ్చుకుంటే టీమిండియాకు తిరుగుండదన్నాడు. అయితే పించ్ హిట్టర్ రిషబ్ పంత్ కోసం విరాట్ త్యాగం చేయాల్సిన సమయం వచ్చేసిందన్నాడు. కోహ్లీ ఓపెనింగ్ నుంచి మూడో పొజిషన్‌కు మారాలని సూచించాడు. అవసరమైతే పంత్‌ను మరింత టాప్‌లో ఆడించాలని, అందుకోసం కింగ్ తన ప్లేస్‌ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలిపాడు. ‘రిషబ్ పంత్ సిచ్యువేషన్స్‌కు తగ్గట్లు తన ఆటతీరును మార్చుకుంటాడు. అతడు డిఫరెంట్ పొజిషన్స్‌లో బ్యాటింగ్ చేయడం చూశాం. కోహ్లీ మూడో స్థానంలో ఆడితే పంత్ ఇంకా సంతోషిస్తాడు. పరిస్థితుల్ని, బౌలర్‌ను, పిచ్‌ను పట్టించుకోకుండా ధనాధన్ క్రికెట్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య’ అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
పంత్ బాల్ వచ్చిందే తడవు బాదేస్తాడని.. అదే అతడి శైలి అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. బాల్ వచ్చిందా కొట్టడం మాత్రమే అతడికి తెలుసునని, మిగతా విషయాలేవీ పట్టించుకోడని వ్యాఖ్యానించాడు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ ఆటతీరు మీద కూడా శ్రీశాంత్ రియాక్ట్ అయ్యాడు. అతడు పార్ట్ టైమర్లా కాకుండా మెయిన్ పేసర్ లెవల్లో బౌలింగ్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. కట్టర్స్‌తో పాటు స్లో బౌన్సర్స్ వేస్తున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు శ్రీశాంత్. ఆస్ట్రేలియా జట్టులో మార్కస్ స్టొయినిస్ పోషిస్తున్న పాత్రే.. టీమిండియాలో హార్దిక్ పోషిస్తున్నాడని స్పష్టం చేశాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇలా కీలక సమయాల్లో వికెట్లు తీయడం జట్టుకు ఎంతో ముఖ్యమని శ్రీశాంత్ వివరించాడు. పాండ్యా ఇలాగే ఆడితే భారత్‌కు తిరుగుండదని, అతడు మున్ముందు టీమ్‌కు మరింత ఇంపార్టెంట్ అవుతాడని చెప్పుకొచ్చాడు. మరి.. పంత్ కోసం కోహ్లీ త్యాగం చేయాలంటూ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
S. Sreesanth ” Rishabh Pant is a player who can adapt to any situation.We have seen him bat at different positions.He will be happy if Virat Kohli goes at number three.Pant doesn’t look at the situation, Wicket or the bowler.He just looks at the ball.”pic.twitter.com/MBiHuDF5yQ
— Sujeet Suman (@sujeetsuman1991) June 14, 2024