iDreamPost

ఊరమాస్‌ షాట్‌ కొట్టిన గిల్‌! కోహ్లీ షాకింగ్‌ రియాక్షన్‌ వైరల్‌

  • Published Nov 02, 2023 | 5:17 PMUpdated Nov 02, 2023 | 5:17 PM

టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన సూపర్‌ ఫామ్‌ను అందుకున్నట్లు ఉన్నాడు. లంకతో మ్యాచ్‌లో 92 పరుగులతో దుమ్మురేపాడు. కొద్దిలో సెంచరీ మిస్‌ అయినా.. గిల్‌ ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో గిల్‌ ఆడిన ఓ ఊరమాస్‌ షాట్‌కు కోహ్లీ..

టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన సూపర్‌ ఫామ్‌ను అందుకున్నట్లు ఉన్నాడు. లంకతో మ్యాచ్‌లో 92 పరుగులతో దుమ్మురేపాడు. కొద్దిలో సెంచరీ మిస్‌ అయినా.. గిల్‌ ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో గిల్‌ ఆడిన ఓ ఊరమాస్‌ షాట్‌కు కోహ్లీ..

  • Published Nov 02, 2023 | 5:17 PMUpdated Nov 02, 2023 | 5:17 PM
ఊరమాస్‌ షాట్‌ కొట్టిన గిల్‌! కోహ్లీ షాకింగ్‌ రియాక్షన్‌ వైరల్‌

వరల్డ్ కప్‌ 2023లో ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. సెమీస్‌లో అధికారికంగా అడుగుపెట్టేందుకు ఉరకలేస్తోంది. గురువారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ​్‌కు దిగిన టీమిండియా భార స్కోర్‌ దిశగా సాగుతోంది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే టీమిండియా కెప్టెన్‌ రోహత్‌ శర్మ వికెట్‌ కోల్పోయినా.. ఆ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపించారు. కానీ, దురదృష్టవశాత్తు ఇద్దరూ కూడా సెంచరీలు పూర్తి చేసుకోలేకపోవడం క్రికెట్‌ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది.

కాగా, ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రోహిత్‌ శర్మను సూపర్‌ డెలవరీతో క్లీన్‌ బౌల్డ్‌ చేసిన మధుషంక వేసిన ఆ ఓవర్‌లో తొలి బంతికే విరాట్‌ కోహ్లీ సూపర్‌ షాట్‌తో బౌండరీ బాదాడు. మూడో బంతికి సింగిల్‌ తీసి.. గిల్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు కోహ్లీ. అయితే.. అప్పటి వరకు కోహ్లీ ఫోర్లు కొడుతుంటే చూసిన గిల్‌.. నేనేమైనా తక్కువ తిన్నానా.. ఇప్పుడు నా తడాఖా చూపిస్తా అన్నట్లు.. ముందుకొచ్చి ఓ ఊరమాస్‌ షాట్‌ ఆడాడు. బ్యాక్‌ ఆఫ్‌ ది లెంత్‌ డెలవరీ ముందుకొచ్చి గిల్‌ కొట్టిన షాట్‌ చూసి.. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కోహ్లీ సైతం షాక్‌ అయ్యాడు. ఆ షాట్‌కు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే.. గిల్‌, కోహ్లీ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకుని.. సెంచరీ దిశగా దూసుకెళ్లారు. కానీ, 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 92 పరుగులు చేసిన తర్వాత గిల్‌ దిల్షాన్‌ మధుషంక బౌలింగ్‌లో కీపర్‌ కుసల్‌ మెండిస్‌కు ఒక సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. బౌన్సర్‌ను అప్పర్‌ కట్‌ ఆడపోయి గిల్‌ అవుట్‌ అయ్యాడు. ఇక గిల్‌ అవుటైన కొద్ది సేపటికే.. విరాట్‌ కోహ్లీ సైతం మధుషంక బౌలింగ్‌లోనే పథుమ్‌ నిస్సంకాకు ఒక ఈజీ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. 94 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసి కోహ్లీ.. ఈ టోర్నీలో మూడో సెంచరీని మిస్‌ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 85, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 95, ఇప్పుడు 88 పరుగులు చేసి సెంచరీకి కొద్ది దూరంలో అవుట్‌ అయ్యాడు. అయితే బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్‌లో గిల్‌ షాట్‌కు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి