SNP
Virat Kohli, Retirement: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేశాడు. కోహ్లీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ కోహ్లీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, Retirement: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేశాడు. కోహ్లీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ కోహ్లీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్, ఫేస్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. తన రిటైర్మెంట్ గురించి ఎవరు మాట్లాడకముందే.. క్రికెట్ అభిమానులను షాక్ గురి చేస్తూ.. సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఒంటి చేత్తో గెలిపిస్తున్నాడు. తొలి 8 మ్యాచ్‌ల్లో 7 ఓటములు చవిచూసిన తర్వాత కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా ఉందంటే.. అందుకు కారణం విరాట్ కోహ్లీ. ఈ ఐపీఎల్ తర్వాత కోహ్లీ టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియాకు కొండంత అండకానున్నాడు.
విరాట్ కోహ్లీ 2.Oగా రెచ్చిపోతున్న తరుణంలో.. మరో ఐదారేళ్ల పాటు కోహ్లీ క్రికెట్ ఆడుతాడని భారత క్రికెట్ అభిమానులు ధీమాగా ఉన్న సమయంలో రిటైర్మెంట్ గురించి కీలక ప్రకటన చేసి అందరి ఆశ్చర్యానికి గురి చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ.. ‘క్రీడాకారుడిగా, మా కెరీర్‌కు ముగింపు తేదీ అంటూ ఒకటి ఉంటుంది. నేను ఎప్పటికీ ఆడుతూ ఉండలేను. ఇప్పటి వరకు ఆడిన క్రికెట్‌లో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆటలో కొనసాగినంత కాలం.. నా హండ్రెడ్ పర్సంట్ ఎఫర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఒక్కసారి నేను ఆట నుంచి దూరమైన తర్వాత.. మీకు కనిపించను’ అని కోహ్లీ అన్నాడు.
నిజానికి కోహ్లీ ఇప్పటికే చాలా సాధించాడు. అయినా కూడా కోహ్లీ కెరీర్‌లో పెద్దగా ఒడిదుడుకులు కూడా చూడలేదు. ఇప్పటి వరకు కూడా తన కెరీర్ అద్భుతంగా సాగింది. టీ20 వరల్డ్ కప్ 2022 కంటే ముందు కాస్త ఇబ్బంది పడిన కోహ్లీ.. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని విధ్వంసం సృష్టిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022, వన్డే వరల్డ్ కప్ 2023లో అద్బుత ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2023లో కూడా 600కి పైగా పరుగులు సాధించాడు. ఇప్పుడు ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి.. బ్యాటర్‌గా ఆరెంజ్ క్యాప్ కోహ్లీ వద్దే ఉంది. ఇంత బాగా ఆడుతున్న కోహ్లీ.. ఇప్పుడు ఇలా రిటైర్మెంట్‌పై పరోక్షంగా స్పందిస్తూ.. ఎక్కువ కాలం ఆడలేను కదా అంటూ ప్రకటించాడు. ఈ మధ్య కోహ్లీపై వస్తున్న స్ట్రైక్‌రేట్ విమర్శలు కూడా కోహ్లీని బాధించినట్లు తెలుస్తోంది. అందుకే రిటైర్మెంట్ గురించి ఆలోచన మొదలుపెట్టాడా? అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. మరి కోహ్లీ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli – As a Sportsman, we do have an end date to our career. I’m just working backwards, I can’t keep playing forever. I’m sure I won’t have any regrets left. I’ll give my all till I’m playing, but once I’m done, I’ll be gone#RCBvsCSK #ViratKohli pic.twitter.com/Vp1OAmmhJ5
— Richard Kettleborough (@RichKettle07) May 16, 2024