Somesekhar
వరల్డ్ క్రికెట్ లో ఏ ఫాస్ట్ బౌలర్ ఎంత స్పీడ్ గా వేసినా.. నాకు స్లోగానే అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే ఇందుకు కారణం ఓ వ్యక్తి అని, అతడి వల్లే ఇది సాధ్యం అవుతుందని పేర్కొన్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? తెలుసుకుందాం పదండి.
వరల్డ్ క్రికెట్ లో ఏ ఫాస్ట్ బౌలర్ ఎంత స్పీడ్ గా వేసినా.. నాకు స్లోగానే అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే ఇందుకు కారణం ఓ వ్యక్తి అని, అతడి వల్లే ఇది సాధ్యం అవుతుందని పేర్కొన్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? తెలుసుకుందాం పదండి.
Somesekhar
ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వారి బౌలింగ్ లో బ్యాటింగ్ చేయాలంటేనే ఒక్కో ఆటగాడికి వెన్నులో వణుకుపుడుతుంది. అలాంటి వరల్డ్ క్లాస్ స్పీడ్ బౌలర్లు సైతం ఓ ప్లేయర్ కు భయపడతారు. అతడే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. అరివీర భయంకర బౌలర్ అయినా సరే.. కింగ్ కోహ్లీ బ్యాట్ ముందు సలాం కొట్టాల్సిందే. అంతలా స్పీడ్ బౌలర్లను చీల్చిచెండాడుతూ ఉంటాడు. అయితే తాను ఇలా ఫాస్ట్ బౌలర్లను దంచికొట్టడానికి ఓ వ్యక్తి కారణం అని చెప్పుకొచ్చాడు కోహ్లీ. మరి ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
విరాట్ కోహ్లీ పేరు చెబితే చాలు ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అతడు క్రీజ్ లోకి వస్తున్నాడు అంటేనే.. ఎలాంటి బంతులు వేయాలి? ఎక్కడ వేయాలి? అని తర్జనభర్జన అవుతుంటారు బౌలర్లు. అయితే బంతులు ఎక్కడ వేసినా కోహ్లీ.. పరుగులు సాధిస్తాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫాస్ట్ బౌలర్లను ఇంతలా దంచికొట్టడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు కోహ్లీ. ఇతడి వల్లే నేను స్పీడ్ బౌలర్లను లెక్కచేయనని ఈ స్టార్ ప్లేయర్ ఓ వ్యక్తి పేరును చెప్పుకొచ్చాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా నెట్ బౌలర్, త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు. అవును రఘు కారణంగానే నేను ఫాస్ట్ బౌలర్లను లెక్క చేయనని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..”నేను ప్రాక్టీస్ లో భాగంగా నెట్స్ లో రఘు 150 కిలోమీటర్ల వేగంతో వేసే బంతులను ఎదుర్కొన్నప్పుడు, నాకు ఒక్కటే అనిపిస్తుంది. ఇతడి బౌలింగ్ ఎదుర్కొన్న తర్వాత అత్యంత ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ కూడా నాకు మీడియం పేస్ లాగే అనిపిస్తుంది. అందుకే నేను స్పీడ్ బౌలర్లను అంత సమర్థవంతంగా ఎదుర్కొగలుగుతున్నాను. నెట్స్ లో రఘు త్రోడౌన్ బాల్స్ అద్భుతంగా వేస్తాడు” అంటూ తన సక్సెస్ సీక్రెట్ వెనక ఉన్న వ్యక్తి గురించి గొప్పగా చెప్పాడు కోహ్లీ. కాగా.. గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియాకు త్రోడౌన్ స్పెషలిస్ట్ బౌలర్ గా సేవలు అందిస్తున్నాడు. బ్యాటర్లు స్పీడ్ బౌలింగ్ లో రాటుదేలడానికి ఎంతో సహాయపడుతున్నాడు.
Virat Kohli once said, “facing Raghu’s 150kmph deliveries in the nets makes the fastest bowlers seem like medium pacers during matches.”
– Raghu, Team India’s Throwdown Specialist! pic.twitter.com/pPYSDfEvmZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 2, 2024