iDreamPost
android-app
ios-app

Virat Kohli: విరాట్ కోహ్లీ క్రేజ్ కు ఇదో మచ్చుతునక! ఆల్ టైమ్ రికార్డు ఇది..

  • Published Jul 03, 2024 | 8:22 AM Updated Updated Jul 03, 2024 | 8:22 AM

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్ తో పాటుగా లైక్స్ ను సొంతం చేసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్ తో పాటుగా లైక్స్ ను సొంతం చేసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 03, 2024 | 8:22 AMUpdated Jul 03, 2024 | 8:22 AM
Virat Kohli: విరాట్ కోహ్లీ క్రేజ్ కు ఇదో మచ్చుతునక! ఆల్ టైమ్ రికార్డు ఇది..

ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాటింగ్ కు దిగితే.. టన్నుల కొద్ది పరుగులు, ఫీల్డింగ్ లో చిరుత పులి వేగం. ఇక ఫిట్ నెస్ లో అయితే విరాట్ కు తిరుగేలేదు. అందుకే అందరూ ఫిట్ నెస్ కా బాప్ అంటూ ఉంటారు ఈ రన్ మెషిన్ ను. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా.. ఇంతా కాదు. అతడు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ పెట్టినా గానీ మిలియన్స్ లో వ్యూస్, లైక్స్ వచ్చిపడతాయి. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డ్ ను సెట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్ తో పాటుగా లైక్స్ ను సొంతం చేసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ తన సహచరులు అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ లతో కలిసి ఊరమాస్ డ్యాన్స్ చేశాడు. పంజాబీ సింగర్ దలేర్ మెహింది పాడిన ఆల్ టైమ్ హిట్ సాంగ్ ‘తునుక్ తునుక్ తున్’ పాటకు వీరు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. ఇక ఈ వీడియోను ఐసీసీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

కాగా.. ఈ వీడియో ఐసీసీ ఇన్ స్టాగ్రామ్ చరిత్రలో అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన పోస్ట్ గా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈ వీడియోను ఏకంగా 126 మిలియన్ల మంది వీక్షించగా.. 9.6 మిలియన్ల మంది లైక్ చేశారు. ఇది ఐసీసీ ఇన్ స్టా చరిత్రలో అత్యధిక ప్రజాధారాన పొందిన పోస్ట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. అదీకాక ఇన్ స్టాలో 20 మిలియన్ల లైక్స్ పొందిన తొలి భారతీయుడిగా, తొలి ఏషియన్ అథ్లెట్ గా, సెకండ్ ఏషియన్, ప్రపంచంలో 5వ అథ్లెట్ గా విరాట్ కోహ్లీ పలు రికార్డులు నెలకొల్పాడు. దాంతో కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. విరాట్ కోహ్లీ క్రేజ్ కు ఇదో మచ్చుతునక అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom