iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీకి టార్గెట్ సెట్ చేసిన గంభీర్.. ఇక మీదట ఆ బాధ్యత విరాట్​దే!

  • Published Aug 02, 2024 | 2:42 PM Updated Updated Aug 02, 2024 | 2:42 PM

భారత కొత్త కోచ్ గౌతం గంభీర్ జూనియర్లతో పాటు సీనియర్ క్రికెటర్లతోనూ కచ్చితత్వంతో ఉంటున్నాడు. టీమ్​లో ఎవరి రోల్ ఏంటో చెప్పి వాళ్లకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాడు.

భారత కొత్త కోచ్ గౌతం గంభీర్ జూనియర్లతో పాటు సీనియర్ క్రికెటర్లతోనూ కచ్చితత్వంతో ఉంటున్నాడు. టీమ్​లో ఎవరి రోల్ ఏంటో చెప్పి వాళ్లకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాడు.

  • Published Aug 02, 2024 | 2:42 PMUpdated Aug 02, 2024 | 2:42 PM
Virat Kohli: కోహ్లీకి టార్గెట్ సెట్ చేసిన గంభీర్.. ఇక మీదట ఆ బాధ్యత విరాట్​దే!

టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ జూనియర్లతో పాటు సీనియర్ క్రికెటర్లతోనూ కచ్చితత్వంతో ఉంటున్నాడు. టీమ్​లో ఎవరి రోల్ ఏంటో చెప్పి వాళ్లకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఫస్ట్ అసైన్​మెంట్​లో గ్రాండ్ సక్సెస్ సాధించిన గౌతీ.. ఇప్పుడు సెకండ్ అసైన్​మెంట్​కు రెడీ అవుతున్నాడు. శ్రీలంకను టీ20 సిరీస్​లో 3-0తో క్లీన్​స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు వన్డే సిరీస్​లో ఆ జట్టును వైట్​వాష్ చేయాలని అనుకుంటోంది. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు ఈ సిరీస్​తో కమ్​బ్యాక్ ఇస్తున్నారు. టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత వీళ్లు ఆడబోయే సిరీస్ ఇదే కానుంది. దీంతో క్రికెట్ లవర్స్ అంతా వీళ్ల మ్యాజిక్ చూసేందుకు సిద్ధమవుతున్నారు.

వన్డే సిరీస్ కోసం లంకకు చేరుకున్న రోహిత్-కోహ్లీతో కొత్త కోచ్ గంభీర్ బాగా కలసిపోయాడు. ట్రెయినింగ్ సెషన్స్​లో ఈ ఇద్దరు దిగ్గజాలతో చాలా సేపు డిస్కస్ చేశాడు. సిరీస్​లో ఎలా ఆడాలి? టీమ్ ప్లాన్స్​, ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలి? అనే చర్చ వాళ్ల మధ్య జరిగినట్లు తెలిసింది. కోహ్లీతో ఉన్న సమయంలో గంభీర్ పెద్దగా నవ్వుతూ, రిలాక్స్​డ్​గా కనిపించాడు. అయితే రోకో జోడీతో సరదాగా ఉంటూనే వాళ్ల రోల్స్ విషయంలో గౌతీ సీరియస్​గా చర్చించాడు. ఈ విషయంపై స్వయంగా అతడే రియాక్ట్ అయ్యాడు. కోహ్లీకి గంభీర్ నయా టార్గెట్ డిసైడ్ చేయడం ఇప్పుడు హైలైట్​గా మారింది. వన్డేల్లో భారత బ్యాటింగ్ యూనిట్ అంతా అతడి చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి కోహ్లీకి కొత్త టార్గెట్ సెట్ చేశాడు.

‘టెస్టులు, టీ20ల కంటే వన్డే క్రికెట్​లో టీమిండియాకు విరాట్ కోహ్లీ ఎంతో కీలకం. 50 ఓవర్ల ఫార్మాట్​లో అతడిది డిఫరెంట్ రోల్​. ఎందుకంటే వన్డేల్లో భారత బ్యాటింగ్ యూనిట్ మొత్తం అతడి చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి కోహ్లీ తన వికెట్​ను కాపాడుకుంటూ జట్టును నడిపించాలి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. జట్టు భారీ స్కోర్లు చేయాలంటే కింగ్ క్రీజులో నిలబడటం ముఖ్యం అనేది గౌతీ ప్లాన్. అతడు క్రీజులో ఉంటే ఇతర బ్యాటర్లకు అండగా ఉంటుంది, కాబట్టి వాళ్లు రెచ్చిపోయి ఆడొచ్చు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్​లో అక్షర్ పటేల్ ఇలాగే విరాట్ సపోర్ట్ చూసుకొని విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అందుకే ఇక మీదట పరుగులు చేయడమే గాక క్రీజులో ఉండి ఇతరులను ఆడించడం, ఆఖరి వరకు ఇన్నింగ్స్​ను లీడ్ చేసే బాధ్యత కూడా కోహ్లీకే గౌతీ అప్పగించాడని అర్థమవుతోంది. మరి.. గంభీర్ సెట్ చేసిన టార్గెట్​ను విరాట్ రీచ్ అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.