తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు కింగ్ కోహ్లీ. నేను పాటించే నినాదమదే అంటూ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు.
తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు కింగ్ కోహ్లీ. నేను పాటించే నినాదమదే అంటూ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ.. వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ, ఓ సెంచరీతో పాటుగా మూడు అర్దశతకాలను సాధించాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో 354 రన్స్ చేసి.. తన బ్యాట్ సత్తా ఏంటో నిరూపిస్తూ చెలరేగుతున్నాడు. ఎక్కువగా తొలుత బ్యాటింగ్ కంటే.. ఛేజింగ్ లోనే పరుగులు చేయడం విరాట్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఇందుకోసం నెట్స్ లో విపరీతంగా శ్రమిస్తుంటాడు. అయితే తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు కింగ్ కోహ్లీ. నేను పాటించే నినాదమదే అంటూ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో ప్రత్యేకంగా ముచ్చటించాడు విరాట్. ఈ సందర్భంగా తాను నమ్మి, ఆచరించే నినాదం ఒకటుందని తెలిపాడు.
విరాట్ కోహ్లీ.. వరల్డ్ క్రికెట్ లో ఓ లెజెండ్. పరుగుల రారాజుగా, రికార్డుల కింగ్ గా, టీమిండియా రన్ మెషిన్ గా ప్రపంచ క్రికెట్ ను ఒంటి చేత్తో ఏలుతున్నాడు. మరి ఇంతటి స్థాయికి చేరుకోవడానికి తాను నమ్మిన, ఆచరించే నినాదం ఒకటుందని ఈ ప్రపంచానికి తెలియజేశాడు విరాట్. తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో ముచ్చటించాడు కోహ్లీ. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ..”నేను సుదీర్ఘకాలం అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి, వ్యక్తిగతంగా, సామర్థ్యపరంగా మెరుగయ్యేందుకు ప్రతీ రోజూ, ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉంటా.
ఇక అత్యుత్తమ స్థాయి అనేది ఎక్కడా ఉండదని నేను భావిస్తూ ఉంటాను. దానికి హద్దు అనేది ఉండదని నా అభిప్రాయం. అలాంటి మైండ్ సెట్ లేకపోతే.. మనం ఒక దశకు వచ్చిన తర్వాత అక్కడే ఆగిపోవాల్సి ఉంటుంది. ఇక నిలకడగా రాణించాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలనేదే నా నినాదం. నేను నమ్మి, పాటించే నినాదమదే. అయితే ఎక్స్ లెన్స్ అనే పదం గురించి నేను పట్టించుకోను. పైగా దానికి సరైన నిర్వచనం కూడా లేదనేది నా ఉద్దేశం. కానీ అంతిమ లక్ష్యం మాత్రం జట్టు విజయమే” అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ చెప్పిన సక్సెస్ సీక్రెట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.