iDreamPost
android-app
ios-app

వీడియో: మ్యాచ్‌లో ఊహించని ఘటన.. కోహ్లీ చెప్తూనే ఉన్నాడు! నెక్ట్స్‌ బాల్‌కే..

  • Published Mar 26, 2024 | 12:01 PM Updated Updated Mar 26, 2024 | 6:01 PM

Virat Kohli, Harpreet Brar: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-బ్రార్‌ మధ్య ఊహించని సంఘటన జరిగింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Virat Kohli, Harpreet Brar: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-బ్రార్‌ మధ్య ఊహించని సంఘటన జరిగింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Mar 26, 2024 | 12:01 PMUpdated Mar 26, 2024 | 6:01 PM
వీడియో: మ్యాచ్‌లో ఊహించని ఘటన.. కోహ్లీ చెప్తూనే ఉన్నాడు! నెక్ట్స్‌ బాల్‌కే..

ఐపీఎల్‌ 2024లో విరాట్‌ కోహ్లీ తన సత్తా ఏంటో రెండో మ్యాచ్‌లో చూపించాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో వరుసగా మూడు వికెట్లు పడటంతో కాస్త స్టోగా ఆడి.. 20 బంతుల్లో 21 పరుగులు చేసిన కోహ్లీ.. పంజాబ్‌ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపాడు. ఆరంభం నుంచే బౌండరీలతో పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్‌లోనే ఏకంగా నాలుగు ఫోర్లు బాది.. సామ్‌ కరన్‌కు ఊహించని షాకిచ్చాడు. మొత్తం 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 77 పరుగులు చేసి.. ఆర్సీబీకి ఈ సీజన్‌లో తొలి విజయం అందించాడు. మ్యాచ్‌ను ఆల్‌మోస్ట్‌ గెలిపించిన కోహ్లీ.. చివర్లో అవుటైనా.. మిగిలిన పనిని ది ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ పూర్తి చేసి.. అదరగొట్టాడు. మొత్తంగా పంజాబ్‌పై ఆర్సీబీ డామినేటింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అది కూడా విరాట్‌ కోహ్లీ, పంజాబ్‌ స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌కి మధ్య. కానీ, బలైంది మాత్రం ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్‌. అసలింతకీ ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం..

177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్‌ కోహ్లీ స్టన్నింగ్‌ స్టార్ట్‌ అందించాడు. తొలి ఓవర్‌లోనే నాలుగు బౌండరీలు బాది పంజాబ్‌కు షాకిచ్చాడు. అయితే.. మరో ఎండ్‌లో మాత్రం ఆర్సీబీ వరుస వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ 3, కామెరున్‌ గ్రీన్‌ 3, రజత్‌ పాటిదార్‌ 18, మ్యాక్స్‌వెల్‌ 3 ఇలా అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆర్సీబీ బ్యాటింగ్‌ లైనప్‌ను పంజాబ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌ బాగా ఇబ్బంది పెట్టాడు. అతని ఓవర్‌లో పరుగులు రావడం చాలా కష్టమైంది. కోహ్లీతో కలిసి బాగా ఆడుతున్నట్లు కనిపించిన పాటిదార్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కోహ్లీ కూడా అతని బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డాడు. బౌలింగ్‌ అద్భుతంగా పడుతుండటంతో.. బ్రార్‌ చాలా ఉత్సాహంగా బౌలింగ్‌ చేస్తున్నాడు.

An incident that no one noticed in the match

ఈ క్రమంలోనే 13వ ఓవర్‌ వేసేందుకు వచ్చాడు బ్రార్‌. మ్యాక్స్‌వెల్‌ అప్పుడే క్రీజ్‌లోకి కొత్తగా వచ్చాడు. అయితే.. మ్యాక్సీ ఇంకా పూర్తిగా సెట్‌ కాకముందే బ్రార్‌ బౌలింగ్‌ వేసేందుకు రెడీ అయిపోయాడు.. కానీ, మ్యాక్సీ అతన్ని ఆపేశాడు. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కోహ్లీ వెంటనే వెనక్కి తిరిగి.. ‘కొంచెం ఆగు.. ఊపిరి తీసుకోనివ్వు’ అంటూ చెప్పాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రవీంద్ర జడేజాను కోహ్లీ ఇలాగే అన్నాడు. అయితే.. కోహ్లీ అలా చెప్పినా కూడా నెక్ట్స్‌ బాల్‌కే మ్యాక్స్‌వెల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అయితే.. బ్యాటర్లు పూర్తిగా రెడీ కాకముందే.. స్పిన్నర్లు వెంటవెంటనే బాల్స్‌ వేయడంతో కుదరుకోడానికి టైమ్‌ ఉండటం లేదు. స్పిన్నర్లకు రన్నప్‌ పెద్దగా ఉండదు. ఓవర్‌ను వేగంగా కంప్లీట్‌ చేద్దాం, బ్యాటర్‌కు టైమ్‌ ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేద్దాం.. ఫీల్డ్‌ సెట్‌ను చూసుకునే టైమ్‌ కూడా ఇవ్వకుండా బౌలింగ్‌ చేయాలని కొంతమంది స్పిన్నర్లు భావిస్తారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఓవర్‌ కంప్లీట్‌ చేసే బౌలర్‌ ఎవరంటే అంతా జడేజా పేరు చెబుతారు. కళ్లు మూసి తెరిచేలోగా కొన్ని సార్లు జడేజా ఓవర్‌ అయిపోతుంది. ఇప్పుడు ఈ హర్‌ప్రీత్‌ బ్రార్‌ కూడా అలాగే తయారయ్యాడు. అందుకే కోహ్లీ కాస్త ఊపరిని తీసుకోనివ్వు అని సరదాగా కోరాడు. అయినా కూడా మ్యాక్స్‌వెల్‌ నెక్ట్స్‌ బాల్‌కే అవుట్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన బ్రార్‌ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి.. 2 కీలక వికెట్లు తీసి.. ఆర్సీబీ ఇబ్బందుల్లోకి నెట్టాడు. అయినా కూడా చివర్లో డీకే విధ్వంసంతో ఆర్సీబీ ఈ మ్యాచ్‌ను 4 వికెట్లతో తేడాతో గెలుపొందింది. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ, బ్రార్‌ మధ్య జరిగిన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.