Somesekhar
తొలి టెస్టు మ్యాచ్ లో చేసిన విధంగానే ఈ మ్యాచ్ లో కూడా బెయిల్స్ కు మంత్రం వేశాడు విరాట్ భాయ్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసారి ఏమైందో చూద్దాం పదండి.
తొలి టెస్టు మ్యాచ్ లో చేసిన విధంగానే ఈ మ్యాచ్ లో కూడా బెయిల్స్ కు మంత్రం వేశాడు విరాట్ భాయ్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసారి ఏమైందో చూద్దాం పదండి.
Somesekhar
సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 1-1తో సమం చేసుకుంది. తొలి టెస్ట్ లో ఇన్నింగ్స్ 32 రన్స్ తో ఓడిపోయిన భారత్.. రెండో టెస్ట్ లో పుంజుకుని దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ నిర్ణయాత్మకమైన మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బుమ్రా, సిరాజ్, ముకేశ్ కుమార్ లు తమ పేస్ బౌలింగ్ తో అదరహో అనిపించారు. దీంతో సిరీస్ ను సమం చేసిన భారత జట్టు చరిత్ర సృష్టించింది. అయితే ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వాటికి కేంద్ర బిందువుగా మారాడు కింగ్ విరాట్ కోహ్లీ. తొలి మ్యాచ్ లో చేసిన విధంగానే ఈ మ్యాచ్ లో కూడా బెయిల్స్ కు మంత్రం వేశాడు విరాట్ భాయ్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసారి ఏమైందో చూద్దాం పదండి.
విరాట్ కోహ్లీ.. తొలిటెస్టులో బెయిల్స్ మార్చి.. వాటికి మంత్రం వేశాడు. దీంతో వెంటనే సఫారీ బ్యాటర్ డీ జోర్జి పెవిలియన్ కు చేరాడు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. తాజాగా జరిగిన రెండో టెస్ట్ లో కూడా ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేశాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ లో తొలిరోజు ఆటలో భాగంగా చివరి ఓవర్లో విరాట్ బెయిల్స్ కు మంత్రం వేశాడు. తన మైండ్ గేమ్ తో బెయిల్స్ ను అటూ ఇటూ మార్చాడు. ఇది గమనించిన మార్క్రమ్ అయోమయానికి గురైయ్యాడు. గత మ్యాచ్ ను బహుశా గుర్తుకుతెచ్చుకున్నాడేమో. అప్పటికే క్రీజ్ లో పాతుకుపోయిన మార్ర్కమ్ ఏకాగ్రతను చెడగొట్టే ప్రయత్నంలో భాగంగానే కోహ్లీ బెయిల్స్ ను ఇలా మార్చాడు.
ఇక ఈ విషయంపై మార్ర్కమ్ అంపైర్లను పరిశీలించమని కోరగా.. కోహ్లీ, కేఎల్ రాహుల్ సైతం దీనిపై స్పందించారు. ఇక ఇదే సమయంలో ముకేశ్ కుమార్ తో చాలా సేపు మాట్లాడాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ చివరి ఓవర్ లో మార్క్రమ్ 4,5 బంతులను బౌండరీలకు తరలించాడు. దీంతో కోహ్లీ వచ్చి ఇలా బెయిల్స్ మార్చాడు. దీంతో బయపడ్డ మార్ర్కమ్ చాలా సేపు సమయాన్ని వృథా చేశాడు. ఇక చివరి బంతిని ఎంతో జాగ్రత్తగా డిఫెన్స్ ఆడి రోజును ముగించి ఊపిరి పీల్చుకున్నాడు. తన ఏకాగ్రతను చెడగొట్టడానికి కోహ్లీ ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ మార్క్రమ్ తలొగ్గలేదు. కాగా.. అద్బుతమైన ఆటతీరుతో సెంచరీ చేశాడు. కానీ తన జట్టుకు మాత్రం ఓటమిని తప్పించలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం కోహ్లీ మంత్రం ఫలించలేదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli again doing this mantra 😂🤣
.
.
.
LEADER VIRAT KOHLI
Captain Rohit Sharma
Ram Siya Ram#INDvsSA #INDvSA #viratkholi #Siraj #RohitSharma𓃵 pic.twitter.com/gAHYcngG5o— Just Clip (@ClipJust70342) January 3, 2024