విక్టరీ పరేడ్‌ ముగిసిన వెంటనే ఆ దేశానికి వెళ్లిపోయిన కోహ్లీ!

Virat Kohli, London, Victory Parade, Mumbai: టీ20 వరల్డ్‌ కప్‌ సాధించిన తర్వాత బిజీబిజీగా గడిపిన విరాట్‌ కోహ్లీ తాజాగా ఇండియా నుంచి ఆ దేశానికి వెళ్లిపోయాడు. కోహ్లీ ఎక్కడి వెళ్లాడో ఎందుకు వెళ్లాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, London, Victory Parade, Mumbai: టీ20 వరల్డ్‌ కప్‌ సాధించిన తర్వాత బిజీబిజీగా గడిపిన విరాట్‌ కోహ్లీ తాజాగా ఇండియా నుంచి ఆ దేశానికి వెళ్లిపోయాడు. కోహ్లీ ఎక్కడి వెళ్లాడో ఎందుకు వెళ్లాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఇండియా నుంచి వెళ్లిపోయాడు. వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను సాధించిన తర్వాత.. జట్టుతో కలిసి కప్పుతో స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లీ. ఢిల్లీలో ఘన స్వాగతం అందుకున్నాడు. ఆ తర్వాత.. హోటల్‌కు వెళ్లి అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వక భేటీలో పాల్గొన్నాడు. అనంతరం అక్కడి నుంచి ముంబైకి చేరుకుని.. బీసీసీఐ ఏర్పాటు చేసిన విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నాడు. ముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌ నుంచి వాంఖడే క్రికెట్‌ స్టేడియం వరకు భారీ జనసందోహం మధ్య ఈ విక్టరీ పరేడ్‌ సాగింది.

స్డేడియానికి చేరుకున్న తర్వాత డ్యాన్సులు, హంగామా, సన్మానం తర్వాత.. విరాట్‌ కోహ్లీ ఫుల్లుగా రెస్ట్‌ తీసుకున్నాడు అనుకుంటే పొరపాటే. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. రెడీ అయిపోయి.. లండన్‌ ఫ్లైట్‌ను అందుకున్నాడు. అప్పటికే స్టేడియంలో కోహ్లీ వాచ్‌ చూసుకుంటూ కనిపించాడు. ఫ్లైట్‌కు టైమ్‌ అవుతుందనే విషయాన్ని చెక్‌ చేసుకుంటూ ఉన్నాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత.. హోటల్‌కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, ఆకాయ్‌ లండన్‌లోనే ఉండటంతో కోహ్లీ అక్కడికి వెళ్లినట్లు సమాచారం.

అయితే.. కోహ్లీ బిజీ షెడ్యూల్‌పై క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. వెస్టిండీస్‌లోని బార్బోడోస్‌ నుంచి 16 గంటల ఫ్లైట్‌ జర్ని చేసి.. ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న కోహ్లీ.. అక్కడి నుంచి ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లి.. అక్కడి నుంచి ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి.. ఆయనతో భేటీ అయ్యి.. అక్కడి నుంచి మళ్లీ విమానంలో ముంబై చేరుకుని, భారీ జనసంద్రం మధ్య విక్టరీ పరేడ్‌లో పాల్గొని.. వాంఖడే స్టేడియానికి వెళ్లి అక్కడ డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్‌ చేసి.. అక్కడి నుంచి మళ్లీ తిరిగి హోటల్‌కు వెళ్లి.. అక్కడి నుంచి లండన్‌ వెళ్లేందుకు మళ్లీ ముంబై ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నాడు. ఇలా ఒక్కరోజులో కోహ్లీ టైట్‌ షెడ్యూల్‌ చూసి క్రికెట్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు. మరి కోహ్లీ బిజీబిజీ లైఫ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments