Somesekhar
వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే?
వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే?
Somesekhar
వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజు అనగానే అందరికి టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీనే గుర్తుకు వస్తాడు. ప్రపంచ క్రికెట్ లో అసాధ్యాలు అనుకున్న రికార్డులను బద్దలు కొడుతూ.. వాటికి సరికొత్త డెఫినెషన్ ఇస్తూ వస్తున్నాడు. ప్రపంచ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు చేస్తూ.. క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నాడు. తాజాగా వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతమైన నాక్ ఆడి, టీమిండియాకు వరల్డ్ కప్ ను అందించాడు. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ లోనే ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
టీమిండియా రన్ మెషిన్ టీ20 వరల్డ్ కప్ గెలవడం ద్వారా సరికొత్త చరిత్రను లిఖించాడు. వరల్డ్ క్రికెట్ లో ఎవ్వరకీ సాధ్యం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్(2008), వన్డే వరల్డ్ కప్(2011), ఛాంపియన్స్ ట్రోఫీ(2013), టీ20 వరల్డ్ కప్ 2024 గెలుచుకున్న తొలి క్రికెటర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇలా నాలుగు ఐసీసీ ట్రోఫీ విజయాల్లో పాలుపంచుకున్న ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి.
ఇంతకు ముందు సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ అండర్ 19 వరల్డ్ కప్(2000), ఛాంపియన్స్ ట్రోఫీ(2002), టీ20 వరల్డ్ కప్(2007), వన్డే వరల్డ్ కప్(2011) విజయాల్లో భాగం అయ్యాడు. కానీ 2002 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా, శ్రీలంక జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో.. ట్రోఫీని పంచుకున్నాయి. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ విజయం తర్వాత టీ20లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కోహ్లీతో పాటుగా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సైతం పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. మరి క్రికెట్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును విరాట్ కోహ్లీ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli is the only cricketer to win the U-19 WC, ODI WC, T20I WC & Champions Trophy.
– THE GOAT HAS COMPLETED CRICKET. 🐐 pic.twitter.com/JFeMXz5AJF
— Johns. (@CricCrazyJohns) June 29, 2024