iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ విజయం.. టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన BCCI!

  • Published Jul 01, 2024 | 7:44 AM Updated Updated Jul 01, 2024 | 7:44 AM

BCCI Announce RS 125 Crore Prize Money Team India: టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న టీమిండియాకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి జై షా. ఆ వివరాలు..

BCCI Announce RS 125 Crore Prize Money Team India: టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న టీమిండియాకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి జై షా. ఆ వివరాలు..

వరల్డ్ కప్ విజయం.. టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన BCCI!

టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడిన టీమిండియా.. 140 కోట్ల మంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. తమ 13 ఏళ్ల ప్రపంచ కప్ కలను నెరవేర్చుకుంది. ఇక ఈ టోర్నీ ప్రారంభం నుంచి ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. పొట్టికప్ ను అందుకుంది. ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి.. ప్రపంచ కప్ ను చేజిక్కించుకుంది. కాగా.. వరల్డ్ కప్ విజయంతో టీమిండియాకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. తన పనిని దిగ్విజయంగా పూర్తి చేసింది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. ఇక వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విధంగా రాసుకొచ్చారు.

“వరల్డ్ కప్ ప్రారంభం నుంచి టీమిండియా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆటగాళ్లు తమ పూర్తి నైపుణ్యాలను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు. ఇంతటి గొప్ప విజయాన్ని, వరల్డ్ కప్ ను అందించిన ఆటగాళ్లు, కోచ్ లు, సపోర్ట్ స్టాఫ్ కు, సిబ్బందికి నా అభినందనలు. టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటిస్తున్నాం” అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు బీసీసీఐ కార్యదర్శి జై షా. ఇక భారత్ ప్రపంచ కప్ గెలవడంతో.. దేశంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రికెట్ లవర్స్ తో పాటుగా సగటు క్రీడాభిమానులు తమ సంతోషాన్ని వీధుల్లోకి వచ్చి పంచుకున్నారు. ఇక మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. మరి టీమిండియాకు బీసీసీఐ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.