Nidhan
Vikram Rathour On Team India: భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందించాడు విక్రమ్ రాథోడ్. అలాంటోడు తాజాగా టీమిండియా ఎన్విరాన్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Vikram Rathour On Team India: భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందించాడు విక్రమ్ రాథోడ్. అలాంటోడు తాజాగా టీమిండియా ఎన్విరాన్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో జట్టు ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు వెళ్లింది. వన్డే ప్రపంచ కప్-2023లో కూడా ఫైనల్‌కు చేరుకుంది. ఈ రెండు టోర్నీల్లో తుదిమెట్టుపై జారిపడినా.. టీ20 వరల్డ్ కప్-2024లో మాత్రం ఛాంపియన్స్‌గా నిలిచింది. సారథిగా రోహిత్ సక్సెస్‌లో ఓ కీలక ఆటగాడి పాత్ర ఎంతో ఉంది. అతడు ఇచ్చిన సపోర్ట్ వల్లే హిట్‌మ్యాన్ మీద ఉన్న ప్రెజర్ చాలా మటుకు తగ్గింది. ఇటు బ్యాటర్‌గా పరుగుల పరంగా కాంట్రిబ్యూషన్ అందిస్తూనే, అటు తన సీనియార్టిని ఉపయోగించి కెప్టెన్సీలోనూ రోహిత్‌కు అండగా నిలబడ్డాడో ప్లేయర్. అతడే విరాట్ కోహ్లీ. అందుకే అతడ్ని రియల్ లీడర్ అని అంటున్నాడు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.
టీమిండియాలో కోహ్లీ రోల్ గురించి విక్రమ్ రాథోడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్‌కు యాటిట్యూడ్ నేర్పింది కోహ్లీనే అని అన్నాడు. ఆటగాళ్ల మైండ్‌సెట్ మార్చేశాడని.. గెలుపే లక్ష్యంగా గ్రౌండ్లో బెస్ట్ ఇచ్చేలా వాళ్లలో స్ఫూర్తిని నింపాడన్నాడు. ‘కోహ్లీ అసలు సిసలు నాయకుడు. అతడు ఇండియన్ టీమ్‌లో నెవర్ గివప్ యాటిట్యూడ్‌ను తీసుకొచ్చాడు. ఏ పరిస్థితుల్లో నుంచైనా మ్యాచ్‌లు గెలిచేలా ఆటగాళ్ల మానసిక దృక్పథాన్ని మార్చేశాడు. విజయమే లక్ష్యంగా పోరాడేలా ప్లేయర్లను సిద్ధం చేశాడు’ అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. విరాట్ అద్భుత బ్యాటర్ అని మెచ్చుకున్న రాథోడ్.. అతడి మైండ్‌సెట్ గురించి ఓ ఎగ్జాంపుల్ ఇచ్చాడు.
ఐపీఎల్లో 980 పరుగులు చేసిన తర్వాత వెస్టిండీస్ టూర్‌కు వెళ్లి అక్కడ డబుల్ సెంచరీ కొట్టాడని కోహ్లీ గురించి విక్రమ్ రాథోడ్ అన్నాడు. డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌లో ఒక్క షాట్‌ను కూడా గాల్లోకి కొట్టలేదన్నాడు. ఐపీఎల్లో 160 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఏకంగా 40 సిక్సులు బాదాడని చెప్పాడు. అయితే ఇంతగా పించ్ హిట్టింగ్‌కు దిగినోడు.. విండీస్‌పై మాత్రం ఒక్క షాట్ కూడా గాల్లోకి ఆడకపోవడం ఆశ్యర్యానికి గురిచేసిందన్నాడు. విరాట్ మైండ్‌సెట్, కమిట్మెంట్కు ఇది నిదర్శనమని ప్రశంసల్లో ముంచెత్తాడు. మ్యాచ్ కండీషన్స్, అపోజిషన్ టీమ్‌ను బట్టి తన గేమ్‌ను అతడు అడ్జస్ట్ చేసుకుంటాడని, ఇది గ్రేట్ క్వాలిటీ అని రాథోడ్ పేర్కొన్నాడు. తన ఫోకస్ మొత్తం టార్గెట్ మీదే పెడతాడన్నాడు. మరి.. కోహ్లీ రియల్ లీడర్ అంటూ విక్రమ్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Vikram Rathore said “Kohli is a Real Leader, he brought never give up attitude to the Indian Team. He has installed the mindset of winning Matches from any situation & always put up fight and go for the win”. [Taruwar Kohli YT] pic.twitter.com/GjMqmXPfAU
— Johns. (@CricCrazyJohns) August 20, 2024