Somesekhar
ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్ట్ లకు టీమిండియా జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. దీంతో దానికి విరాట్ కోహ్లీనే కారణమని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజానికి టీమ్ ను ప్రకటించకపోవడానికి రీజన్ కోహ్లీ కాదట.
ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్ట్ లకు టీమిండియా జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. దీంతో దానికి విరాట్ కోహ్లీనే కారణమని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజానికి టీమ్ ను ప్రకటించకపోవడానికి రీజన్ కోహ్లీ కాదట.
Somesekhar
ఇంగ్లాండ్ తో జరగబోయే మిగిలిన మూడు టెస్ట్ లకు బీసీసీఐ జట్టును ఎప్పుడు ప్రకటిస్తుందా? అని ఎదురుచూస్తున్నారు క్రికెట్ లవర్స్. ఇక ఇందుకోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ గురువారం సమావేశం అయ్యింది. కానీ జట్టును మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీంతో సమావేశం జరిగిందా? లేదా? అన్న సందేహం నెలకొంది. అయితే టీమిండియా జట్టును ఇప్పటి వరకు ప్రకటించకపోవడానికి అందరూ కోహ్లీనే కారణం అంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
ఇంగ్లాండ్ తో మిగిలిన టెస్టులకు ఎవరెవరిని జట్టులోకి తీసుకుంటారు అన్న సందేహం సగటు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే విరాట్ కోహ్లీ ఎలాంటి సమాచారం బీసీసీఐకి ఇవ్వలేదని, దాంతోనే సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించడంలో ఆలస్యం చేస్తోందని చాలా మంది సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. దీంతో బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. ఇదిలా ఉండగా.. కోహ్లీ వ్యక్తిగత కారణాలతో మిగిలిన టెస్టులకు అందుబాటులో ఉండడని ధృవీకరించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో అన్నారు. దీంతో కోహ్లీని సెలెక్టర్లు పక్కనపెట్టేశారని తెలుస్తోంది. అయితే జట్టు ప్రకటించకపోవడానికి అసలు కారణం జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా. వీరి ముగ్గురి కారణంగానే టీమ్ ను ప్రకటించడం ఆలస్యం అవుతోంది.
కాగా.. మూడో టెస్ట్ కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేమ్ మెంట్ ఆలోచిస్తోంది. కానీ అతడిని రాజ్ కోట్ టెస్ట్ లో ఆడించాలని సెలెక్టర్లు చెబుతున్నారు. ఇక రాహుల్, జడేజాల ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. వీరిద్దరికి ఎన్సీఏలో అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదీకాక మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తగిన సమయం ఉందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే జట్టును ప్రకటించడంలో ఎలాంటి హడావిడి చేయడం లేదు. మరి బీసీసీఐ ఇంగ్లాండ్ తో మిగిలిన టెస్ట్ లకు జట్టును ప్రకటించకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: Prithvi Shaw: సెంచరీతో దుమ్మురేపిన పృథ్వీ షా! టీమిండియాలోకి రీఎంట్రీ?