SNP
Virat Kohli, RCB vs KKR: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అవుటైన తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే.. కొంతమంది మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీది క్లియర్‌గా నాటౌట్ అంటున్నారు. వాళ్లు ఎవరు? ఎందుకు నాటౌట్ అంటున్నారో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, RCB vs KKR: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అవుటైన తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే.. కొంతమంది మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీది క్లియర్‌గా నాటౌట్ అంటున్నారు. వాళ్లు ఎవరు? ఎందుకు నాటౌట్ అంటున్నారో ఇప్పుడు చూద్దాం..
SNP
కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి కంటే.. కోహ్లీ అవుట్‌పైనే తీవ్ర చర్చ జరుగుతోంది. కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అవుటైన విషయం తెలిసిందే. ఈ అవుట్‌పై కోహ్లీనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక క్రికెట్ అభిమానులైతే.. సోషల్ మీడియాలో బీసీసీఐపై, అంపైర్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్లు సైతం విరాట్ కోహ్లీకి మద్దతుగా మాట్లాడుతూ.. అసలు విరాట్ కోహ్లీ అవుట్ కాదంటూ.. అన్యాయంగా అవుట్ ఇచ్చారంటూ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. కోహ్లీ నాటౌట్ అని చెబుతున్న ఆ క్రికెటర్లు ఎవరు? ఎందుకు నాటౌట్ అంటున్నారో ఇప్పుడు చూద్దాం..
భారత మాజీ క్రికెటర్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మొహమ్మద్ కైఫ్.. కోహ్లీ నాటౌట్ అని తేల్చిపారేశారు. ముందుగా సిద్దూ ఏమన్నారంటే.. ‘కోహ్లీ క్లియర్‌గా నాటౌట్, మీరు బీమర్లు వేసి అవుట్ అంట ఎలా? ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. గేమ్‌కు మంచిది కాదు. బీమర్లతో అవుట్ చేస్తామంటే ఎలా.. అది క్లియర్‌గా నాటౌట్’ అని సిద్ధూ అన్నారు. నిజానికి దాన్ని మీమర్‌గా గుర్తించవచ్చు. కానీ, బాల్ ట్రాకింగ్ సమయంలో క్రీజ్‌లోకి వచ్చే టైమ్‌కి బాల్ డిప్ అయింది. అంటే దాని ఎత్తు తగ్గిపోయింది. దీంతో.. దాన్ని లీగల్ డెలవరీగా అంపైర్లు నిర్ధారించారు. అయితే.. బంతిలో వేగం ఉండి ఉంటే.. అది అదే ఎత్తులో క్రీజ్ వరకు ప్రయాణించేది. కానీ, బాల్‌లో వేగం లేకపోవడంతో అది డిప్ అవుతుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
ఇక మరో టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘ఇది సరైన నిర్ణయం కాదు. బాల్, బ్యాట్‌ను తాకుతున్న చోటు చూస్తే.. నడుముకు చాలా ఎత్తులో ఉంది. అది కచ్చితంగా నో బాల్‌గా పరిగణించాలి. అలాగే బాల్ ట్రాకింగ్‌లో ప్రతి సారి బాల్ బ్యాట్‌కు తగిలిన చోట నుంచి డిప్ అవుతుంది.’ అంటూ బాల్ ట్రాకింగ్‌పై తన అనుమానం వ్యక్తం చేశారు కైఫ్. ఆయన చెప్పింది కూడా ఆలోచించాల్సిన విషయమే.. బాల్ ట్రాకింగ్‌లో బాల్ ఒక్కసారిగా భారీగా దిప్ అవుతుందని, బాల్ బౌలర్ చేతి నుంచి రిలీజ్ అయ్యే దగ్గరి నుంచి బాల్ ట్రాకింగ్ చూపిస్తే.. క్లియర్‌గా అర్థం అవుతుందని క్రికెట్ అభిమానులు కూడా అంటున్నారు. కోహ్లీ అవుట్ ఆర్సీబీపై తీవ్ర ప్రభావం చూపింది. మరి కోహ్లీ అవుట్‌పై మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ViratKohli #RCBvsKKR pic.twitter.com/oM31henZQ7
— Sayyad Nag Pasha (@nag_pasha) April 22, 2024