iDreamPost
android-app
ios-app

Virat Kohli: సెంచరీ చేసినా విరాట్ కోహ్లీపై విమర్శలు! సెల్ఫిష్ అంటూ..

  • Published Apr 06, 2024 | 9:58 PM Updated Updated Apr 06, 2024 | 9:58 PM

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టినా కోహ్లీ సెల్ఫిష్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు. దానికి రీజన్ ఏంటి?

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టినా కోహ్లీ సెల్ఫిష్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు. దానికి రీజన్ ఏంటి?

Virat Kohli: సెంచరీ చేసినా విరాట్ కోహ్లీపై విమర్శలు! సెల్ఫిష్ అంటూ..

ఐపీఎల్ 2024 సీజన్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఐపీఎల్ లో సరికొత్త చరిత్రను నెలకొల్పాడు. అయితే సెంచరీ కొట్టినా కోహ్లీని సెల్ఫిష్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు. దీంతో సెల్ఫిష్ అనే పదం ట్విట్టర్ లో ట్రెండిగ్ లోకి వచ్చింది. మరి విరాట్ ను ఇలా అనడానికి కారణం ఏంటి? పరిశీలిద్దాం పదండి.

రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప ఇన్నింగ్స్ లలో ఒకటిగా క్రీడాపండితులు చెప్పుకొస్తున్నారు. అలాంటి కొందరు నెటిజన్లు ఈ ఇన్నింగ్స్ ను సెల్ఫిష్ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే? కోహ్లీ-డుప్లెసిస్ జోడీ ధాటిగానే బ్యాటింగ్ ప్రారంభించారు. రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా తమ బ్యాట్లకు పనిచెప్పారు. తొలి వికెట్ కు 14 ఓవర్లలో 125 పరుగులు జోడించారు. ఇంకేంటి మరి బాగానే ఆడారుగా అని అందరికి అనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడే కాస్త పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ 50 పరుగులు చేయడానికి 39 బంతులు తీసుకున్నాడు. సెంచరీని 67 బంతుల్లో పూర్తి చేశాడు. ఇదే ఈ సెల్ఫిష్ అనే విమర్శకు దారితీసింది.

వన్డేల్లో ఇలాంటి ఇన్నింగ్స్ లు గొప్ప విషయమే. కానీ టీ20ల్లో ఎన్ని తక్కువ బంతులు ఎదుర్కొని అంత ఎక్కువ పరుగులు చేస్తేనే ఫలితం ఉంటుంది, పేరొస్తుంది. కోహ్లీ సెంచరీకి 67 బంతులు తీసుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్లు అయితే.. కేవలం 40 నుంచి 50 బంతుల్లోనే వంద కొట్టేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్ట్రైక్ రేట్ కూడా పెద్దగలేదని వారు పేర్కొంటున్నారు. కోహ్లీ 156 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం గొప్ప విషయమేమీ కాదని తెలుపుతున్నారు. ఈ శతకం ఐపీఎల్ చరిత్రలోనే స్లోయెస్ట్ అని ట్రోల్ చేస్తున్నారు. మరి నిజంగానే నెటిజన్లు విమర్శిస్తున్నట్లుగా ఇది విరాట్ కోహ్లీ సెల్ఫిష్ ఇన్నింగ్సేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.