SNP
Virat Kohli, Rohit Sharma: కెప్టెన్‌గా, ఆటగాడిగా రోహిత్ శర్మ కెరీర్ ముగింపుకు దగ్గరగా ఉంది. మహా అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత కొన్ని నెలల కొనసాగే అవకాశం ఉంది. అయితే.. కప్ గెలవాలనే రోహిత్ కలను తీర్చేందుకు శత్రువుగా కనిపించే ఒక మిత్రుడు ఒక సలార్ ఉన్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, Rohit Sharma: కెప్టెన్‌గా, ఆటగాడిగా రోహిత్ శర్మ కెరీర్ ముగింపుకు దగ్గరగా ఉంది. మహా అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత కొన్ని నెలల కొనసాగే అవకాశం ఉంది. అయితే.. కప్ గెలవాలనే రోహిత్ కలను తీర్చేందుకు శత్రువుగా కనిపించే ఒక మిత్రుడు ఒక సలార్ ఉన్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇటీవల హైదరబాద్‌లో ముగిసిన తొలి టెస్టులో ఇండియా ఓటమి పాలైంది. అయితే.. చాలా మంది క్రికెట్ అభిమానులు జట్టులో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజానికి వారి మాటను ఇంగ్లండ్‌తో జరిగిన ఒక్క టెస్ట్ మ్యాచ్‌కి మాత్రమే పరిమితం చేసి చూడకుండా.. ఒకసారి కోహ్లీ టీమ్‌లో ఉంటే ఎలా ఉంటుంది? టీమ్‌లో అతను లేకుంటే పరిస్థితి ఎలా మారుతుందో ఒకసారి పరిశీలిస్తే.. చాలా తేడా కనిపిస్తోంది. ఆ కోణంలోనే టీమిండియాకు పెద్ద దిక్కుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఎంత బలమైన స్నేహముందో కూడా అర్థమవుతోంది.
టీమిండియాలో రోహిత్, కోహ్లీ దాదాపు దశాబ్దకాలంగా కలిసి ఆడుతున్నారు. అయితే.. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదనే పుకార్లు చాలా సార్లు వచ్చాయి. టీమ్‌లో ఇద్దరూ రెండు గ్రూపులు మెయిటేన్ చేస్తారని కూడా కొన్ని సార్లు వార్తలు వచ్చాయి. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ప్రస్తుతం రోహిత్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. రోహిత్ కెరీర్ దాదాపు చివరి దశకు వచ్చేసిందనే చెప్పాలి. మహా అయితే.. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్, వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు టీమిండియా వెళ్తే ఆడొచ్చు. ప్రస్తుతం రోహిత్ ముందున్న బిగ్ ఈవెంట్స్ ఈ రెండే. ఈ రెండింటి తర్వాత.. రోహిత్ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
కానీ, ఈ రెండు సాధించాలంటే మాత్రం రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ తోడు ఉండాల్సిందే. కోహ్లీ టీమ్‌లో ఉంటే.. ఒక కెప్టెన్‌కు ఎలాంటి సపోర్ట్ కావాలో అలాంటి మద్దుతును కోహ్లీ అందిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022, వన్డే వరల్డ్ కప్ 2023, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023లను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కోహ్లీ టీమ్‌లో ఉంటే రోహిత్ చాలా ఫ్రీగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతూ.. తన వందశాతం ఎఫర్ట్‌ను ఇవ్వగలుగుతున్నాడు. పవర్ ప్లేలో అగ్రెసివ్ ఇంటెంట్‌తో భారీ షాట్లు ఆడుతున్నాడు. అలా ఆడే క్రమంలో తాను అవుటైనా.. తర్వాత ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు వెనుక కోహ్లీ ఉన్నాడనే నమ్మకం రోహిత్‌కు ఉంది. కెప్టెన్‌కు తనపై ఉన్న నమ్మకాన్ని కోహ్లీ కూడా అదే స్థాయిలో నిలబెట్టుకుంటూ వస్తున్నాడు.
అయితే.. కోహ్లీ టీమ్‌లో లేని సమయంలో మాత్రం రోహిత్‌పై భారం చాలా ఎక్కువగా ఉంటుంది. తనకు బాగా అలవాటైపోయిన అగ్రెసివ్ ఇంటెంట్‌తోనే రోహిత్ ఆరంభ ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ, ఒక్కోసారి అలా ఆడే క్రమంలోనే త్వరగా అవుటైతే.. తర్వాత వచ్చే బ్యాటర్లలో ఎవరూ కూడా కోహ్లీ రోల్‌ను పోషించలేకపోతున్నారు. దాంతో రోహిత్ శర్మ కూడా ఆలోచనలో పడిపోతున్నాడు. టీమ్‌లో కోహ్లీ ఉంటే రోహిత్ ఆటకు, కోహ్లీ టీమ్‌లో లేకుంటే రోహిత్ ఆటకు చాలా తేడా ఉంటుంది. రోహిత్ అద్భుతంగా ఆడి మంచి స్టార్ట్ అందిస్తే.. దాన్ని అదే లెవెల్‌లో ముందుకు తీసుకెళ్తాడు కోహ్లీ, లేదూ రోహిత్ త్వరగా అవుటైతే.. కోహ్లీ నిదానంగా ఆడుతూ నష్టాన్ని భర్తి చేస్తాడు. ఇక వాళ్లిద్దరూ విఫలమైన చోట టీమిండియాను ఆ దేవుడే కాపాడాల్సిన పరిస్థితి.
ఇలా రోహిత్-కోహ్లీ జోడీ బయటికి చెప్పకుండానే, చర్చించకుండానే.. ఒక సాలిడ్ అండర్‌స్టాండింగ్‌తో టీమిండియాను ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని, ఒకరంటే ఒకరి పడదని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ కోసం.. విరాట్ కోహ్లీ ఎరైనా అవుతున్నాడు, సోరైనా అవుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు అసలైన సలార్ కోహ్లీ. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ చెప్పినట్లు ఇద్దరు గొప్ప స్నేహితులు ఎప్పుడూ వారి స్నేహం గురించి బయటికి చెప్పరు, అస్తమానం ఒకరిపై ఒకరు చేతులేసుకుని తిరగరు. ఇక్కడ కోహ్లీ-రోహిత్ కూడా అంతే. వారి టార్గెట్ ఒక్కటే ఇండియా గెలవాలి. ప్రస్తుతం టీమిండియాకు రోహిత్ కెప్టెన్ కాబట్టి.. ఒక సలార్‌లా, నిజమైన మిత్రుడిలా కోహ్లీ అండగా ఉంటున్నాడు, ఉంటాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ లేడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గదను ఎత్తితే.. అందులో కోహ్లీ పాత్ర కచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఈ ప్రపంచానికి వీరి స్నేహం విలువ తెలుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Most Top Scores in T20Is where India scored
above 200: Rohit (6)
above 190: Rohit (9)
above 180: Rohit (11)
above 170: Rohit/Kohli (15)
above 160: Rohit (22)
above 150: Kohli (26)
above 140: Kohli (30)
Happy friendship day rohirat ❤️ pic.twitter.com/k0YxFmXjco— Rohirat™ (अखण्ड भारत)🕉️ (@Rohitratgoathai) August 6, 2023