iDreamPost
android-app
ios-app

Virat Kohli: టెస్ట్‌ క్రికెట్‌లో ఉన్న గొప్పతనం ఏంటి? కోహ్లీ మాటల్లో వినండి..

  • Published Dec 30, 2023 | 5:31 PM Updated Updated Dec 30, 2023 | 5:31 PM

సంప్రదాయ క్రికెట్ గా పిలువబడే టెస్ట్ క్రికెట్ గొప్పదనాన్ని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా వివరించాడు. అందుకు సంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సంప్రదాయ క్రికెట్ గా పిలువబడే టెస్ట్ క్రికెట్ గొప్పదనాన్ని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా వివరించాడు. అందుకు సంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Virat Kohli: టెస్ట్‌ క్రికెట్‌లో ఉన్న గొప్పతనం ఏంటి? కోహ్లీ మాటల్లో వినండి..

‘ముందొచ్చిన చెవుల కన్నా.. వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లుగా తయ్యారు అయ్యింది టెస్ట్ క్రికెట్ పరిస్థితి. ఎప్పుడైతే వరల్డ్ క్రికెట్ లోకి టీ20లు ప్రవేశించాయో.. అప్పటి నుంచి సంప్రదాయ క్రికెట్ గా పేరుగాంచిన టెస్ట్ ఫార్మాట్ కనుమరుగు అవ్వడం ప్రారంభం అయ్యింది. పొట్టి ఫార్మాట్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులకు సైతం 5 రోజుల ఆట బోరుకొట్టింది. దీంతో టెస్టు మ్యాచ్ లు చూడ్డం తగ్గించేశారు. అదీకాక ఐపీఎల్ ఎంట్రీతో టెస్టుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే సంప్రదాయ క్రికెట్ గా పిలువబడే టెస్ట్ క్రికెట్ గొప్పదనాన్ని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా వివరించాడు. అందుకు సంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ఫార్మాట్ గురించి కోహ్లీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం.

టెస్ట్ క్రికెట్ కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. టీ20లు, వన్డేలు రాకముందు టెస్ట్ క్రికెట్ కు ఎనలేని ప్రేక్షకాదరణ ఉంది. అయితే ఎప్పుడైతే వన్డే ఫార్మాట్ ప్రారంభం అయినా టెస్టు ఫార్మాట్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ టీ20లు వచ్చిన దగ్గర నుంచే సంప్రదాయ క్రికెట్ కు రోజులు దగ్గర పడటం మెుదలైయ్యాయి. ప్రేక్షకులు ఈ ఫార్మాట్ ను దాదాపుగా మర్చిపోవడానికి దగ్గరవుతున్నారు. ఇలాంటి టైమ్ లో టెస్ట్ క్రికెట్ లో ఉన్న గొప్పతనం ఏంటో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అద్భుతంగా చెప్పుకొచ్చాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. టెస్టులు ఆడటం అంతఈజీ కాదని, అందుకు ఎంతో దమ్ముండాలని వివరించాడు.

టెస్ట్ ఫార్మాట్ గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..”టెస్టులను ఎంటర్ టైన్ మెంట్ కోణంలో చూసే వారికి బోర్ కొట్టొచ్చు. కానీ ఈ ఫార్మాట్ లో ఒక ఆటగాడిలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, అతడు ఎంత అద్బుతంగా రాణించగలుగుతాడో తెలుసుకోవచ్చు. ఈ మ్యాచ్ లు ఒక గంటలో, ఒక రోజులో ముగిసేవి కావు. ఐదు రోజుల సమయంలో ఫస్ట్ బాల్ కే అవుటైతే.. తర్వాత రోజు మెుత్తం ఖాళీగానే కూర్చోవాలి. అయితే ఇలాంటి టైమ్ లో ప్లేయర్లను ఎలా మోటివేట్ చేయాలి? గేమ్ స్ట్రాటజీ, మ్యాచ్ ను ఎలా గెలవాలి అన్న ఆలోచనలమీదే మా మనసు ఉంటుంది. ఇక ఈ ఫార్మాట్ లో ఉన్న అద్భుతమైన అంశం ఏంటంటే? మ్యాచ్ లో వెనకబడ్డ స్థాయి నుంచి పుంజుకుని విజయం సాధించొచ్చు. మరీ ముఖ్యంగా టెస్టులు ఆడాలంటే దమ్ముండాలి” అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ భాయ్.

వన్డే, టీ20 ఫార్మాట్స్ లో మ్యాచ్ ముగియగానే ఆటగాళ్లతో మాట్లాడి, రిలాక్స్ అవుతాము. కానీ టెస్టు క్రికెట్ లో అలా కాదు.. టైమింగ్స్ ఉంటాయి. నిద్రపోవడం, లేవడం లాంటి మెంటల్ ప్రిపరేషన్స్ చాలా అవసరం. ఈ ఐదు రోజుల ఆటలో ఓ ఆటగాడి ఫిట్ నెస్, మెంటల్ స్టేటస్ లు తెలుస్తాయి.. అందుకే టెస్టులు అంటే నాకు ఎంతో గౌరవం అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుతం విరాట్ చెప్పిన ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి టెస్టు క్రికెట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.