Nidhan
ఆస్ట్రేలియా టీమ్ మరోమారు తన వంకర బుద్ధిని చాటుకుంది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవమానించింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ కంగారూలపై సీరియస్ అవుతున్నారు.
ఆస్ట్రేలియా టీమ్ మరోమారు తన వంకర బుద్ధిని చాటుకుంది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవమానించింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ కంగారూలపై సీరియస్ అవుతున్నారు.
Nidhan
ప్రస్తుత క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లుగా భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చెప్పొచ్చు. క్రిటిక్స్, అనలిస్టుల నుంచి మాజీ క్రికెటర్స్ వరకు అందరూ రోహిత్, విరాట్ టాప్ ప్లేయర్స్ అని చెప్పడం చూసే ఉంటారు. జెంటిల్మన్ గేమ్‌లోని ఎన్నో రికార్డుల్ని వీళ్లిద్దరూ బ్రేక్ చేశారు. ఫార్మాట్ ఏదైనా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ, బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు రోహిత్. ఫార్మాట్‌కు తగ్గట్లు తన గేమ్‌ను అడ్జస్ట్ చేసుకుంటూ మ్యాచ్‌లు ఫినిష్ చేయడం విరాట్‌కు అలవాటు. వీళ్లిద్దరిలో ఏ ఒక్కరు ఆఖరి వరకు క్రీజులో ఉన్నా టీమిండియా ఆ మ్యాచ్ గెలిచినట్లే. బ్యాటింగ్ టాలెంట్‌తో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నారు హిట్‌మ్యాన్-కోహ్లీ. రోహిత్ అయితే కెప్టెన్‌గానూ ఆకట్టుకుంటున్నాడు. టీమ్‌ను సమర్థవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. అయితే ఈ ఇదరు స్టార్ ప్లేయర్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా అవమానించింది. కంగారూలు మరోమారు తమ వంకర బుద్ధి చూపించారు.
అప్పుడు హిట్‌మ్యాన్‌ను, ఇప్పుడు కోహ్లీని అవమానించింది ఆసీస్. 2023 ఏడాది పూర్తవడంతో ఆ ఇయర్‌కు గానూ టెస్ట్ టీమ్‌ను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో కోహ్లీకి చోటు కల్పించలేదు. ఈ జట్టులో ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, జో రూట్, హ్యారీ బ్రూక్, లోర్కాన్ టక్కర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), కగిసో రబాడ, స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు. అయితే కోహ్లీకి మాత్రం ఇందులో చోటు కల్పించలేదు. కింగ్ కోహ్లీనే కాదు గతంలో రోహిత్ శర్మనూ ఇదే రీతిలో అవమానంచింది ఆసీస్. వన్డే వరల్డ్ కప్-2023లో రోహిత్ 597 పరుగులతో దుమ్మురేపాడు. బ్యాటింగ్‌తో పాటు స్మార్ట్ కెప్టెన్సీతోనూ ఆకట్టకున్నాడు. సీనియర్లు, జూనియర్లతో నిండిన టీమ్‌ను అద్భుతంగా ముందుకు నడిపించాడు. టైమ్‌కు తగ్గట్లు డెసిజన్స్ తీసుకుంటూ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
మెగా టోర్నీలో భారత గెలుపులో కెప్టెన్‌గా రోహిత్ శర్మ చేసిన కృషిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఒక్క ఫైనల్ మ్యాచ్‌లో తప్పితే అంతటా అతడు తన మాస్టర్ మైండ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే వరల్డ్ కప్ ఫైనల్ టైమ్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రపంచ కప్-2023 టీమ్‌ను ప్రకటించింది. ఆ బెస్ట్ ఎలెవన్‌లో హిట్‌మ్యాన్‌కు చోటు కల్పించలేదు. దీంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. కావాలనే భారత సారథిని అవమానించాలనే ఉద్దేశంతోనే ఆసీస్ అలా చేసిందనే కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు మరోమారు కంగారూ టీమ్ తన వక్రబుద్ధిని చాటుకుంది. టెస్ట్ టీమ్‌లో కోహ్లీని తీసుకోలేదు. దీంతో టీమిండియా అభిమానులు సీరియస్ అవుతున్నారు. కావాలనే విరాట్‌ను ఆస్ట్రేలియా అవమానించిందని ఫైర్ అవుతున్నారు. ఆ టీమ్ పని పట్టాలని.. అవకాశం వచ్చినప్పుడు అంతకంతా పగ తీర్చుకోవాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అప్పుడు రోహిత్, ఇప్పుడు కోహ్లీని ఆసీస్ అవమానించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: UAE vs AFG: వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్‌ను ఓడించిన ఆఫ్ఘానిస్థాన్‌కు ఘోర అవమానం!
Cricket Australia Test team of the year:
Khawaja, Karunaratne, Williamson, Root, Brook, Lorcan Tucker, Jadeja, Ashwin, Cummins (C), Rabada and Broad. pic.twitter.com/TX3NfqQNeY
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023