iDreamPost

Virat Kohli: ఫైనల్​లో కోహ్లీ వల్ల గెలవలేదు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడికి ఇవ్వాల్సింది!

  • Published Jul 02, 2024 | 10:25 PMUpdated Jul 02, 2024 | 10:33 PM

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ తన బెస్ట్ ఇచ్చాడు. మెగాటోర్నీ మొత్తం ఫెయిలైన కింగ్.. తుదిపోరులో మాత్రం అంతా తానై భారత ఇన్నింగ్స్​ను నడిపించాడు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ తన బెస్ట్ ఇచ్చాడు. మెగాటోర్నీ మొత్తం ఫెయిలైన కింగ్.. తుదిపోరులో మాత్రం అంతా తానై భారత ఇన్నింగ్స్​ను నడిపించాడు.

  • Published Jul 02, 2024 | 10:25 PMUpdated Jul 02, 2024 | 10:33 PM
Virat Kohli: ఫైనల్​లో కోహ్లీ వల్ల గెలవలేదు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడికి ఇవ్వాల్సింది!

టీ20 వరల్డ్ కప్-2024 మొదలవడానికి ముందు టీమిండియా ఆశలన్నీ విరాట్ కోహ్లీ మీదే పెట్టుకుంది. ఐపీఎల్-2024లో అతడు టాప్ స్కోరర్​గా నిలవడం, పొట్టి కప్పుకు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా-వెస్టిండీస్ పిచ్​లు అతడి బ్యాటింగ్​కు సరిపోవడంతో కింగ్ బ్యాట్​తో మ్యాజిక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. అతడే లీడింగ్ స్కోరర్ అవుతాడని భావించారు. కానీ టోర్నీలో అతడి ఫ్లాప్ షో నడిచింది. ఫైనల్ మ్యాచ్ వరకు కింగ్ వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఆడిన 7 మ్యాచుల్లో కలిపి 75 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీ పనైపోయిందనే విమర్శలు ఊపందుకున్నాయి. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా కోచ్ రాహుల్ ద్రవిడ్ తదితరులు మాత్రం అతడికి సపోర్ట్​గా నిలిచారు.

కోహ్లీ నుంచి ఇంకా బెస్ట్ రావాల్సి ఉందని, బహుశా ఫైనల్ మ్యాచ్​ కోసం అతడు దాన్ని దాచి ఉంచాడంటూ రోహిత్, ద్రవిడ్ చెప్పారు. వాళ్ల మాటే నిజమైంది. తుదిపోరులో కోహ్లీ తన బెస్ట్ ఇచ్చాడు. మెగాటోర్నీ మొత్తం ఫెయిలైన కింగ్.. టైటిల్ ఫైట్​లో మాత్రం అంతా తానై భారత ఇన్నింగ్స్​ను నడిపించాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. రోహిత్, సూర్యకుమార్, పంత్ ఔటైన దశలో ఇన్నింగ్స్​ నిర్మించే బాధ్యతల్ని భుజాల మీద వేసుకున్నాడు. ఒక్కో రన్​తో స్కోరు బోర్డును నడిపిస్తూ ఆఖర్లో విధ్వంసక షాట్లతో విరుచుకుపడ్డాడు. విరాట్ ఆడకపోతే మ్యాచ్​లో రిజల్ట్ మరోలా ఉండేది. అందుకే అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం కోహ్లీకి ఈ పురస్కారం ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నాడు.

కోహ్లీ వల్ల ఫైనల్​లో గెలవలేదని, ఈ విజయంలో అసలు క్రెడిట్ జస్​ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్​దీప్ సింగ్ లాంటి బౌలర్లకు ఇవ్వాలన్నాడు మంజ్రేకర్. వీళ్ల వల్లే మ్యాచ్ టర్న్ అయిందని, కోహ్లీ ఇన్నింగ్స్​కు విలువ కూడా ఈ ప్లేయర్లు రాణించడం వల్లే దక్కిందన్నాడు. విరాట్​కు కాకుండా ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు ఇచ్చి ఉండే బాగుండేదన్నాడు మంజ్రేకర్. ఆఖరి ఓవర్​లో మ్యాచ్​ను టర్న్ చేసిన హార్దిక్​తో పాటు మిగిలిన బౌలర్లే రియల్ హీరోస్​ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. ఒకదశలో సౌతాఫ్రికా గెలిచేందుకు 90 శాతం అవకాశాలు ఉన్నాయని, భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారని.. అక్కడి నుంచి బౌలర్లే మ్యాచ్​ను మన వైపు తిప్పారన్నాడు. కోహ్లీ చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడంటూ విమర్శించాడు. మరి.. బౌలర్లలో ఒకరికి ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ ఇవ్వాల్సిందంటూ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య భారత మాజీ హెడ్ కోచ్.. సచిన్​ను సానబెట్టినోడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి