SNP
SNP
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తన ఆటతో, యాటిట్యూడ్‌తో అపరిమితమైన అభిమానాన్ని కోహ్లీ సంపాదించుకున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న కింగ్ కోహ్లీ.. తాజాగా మరో రికార్డును అదిగమించాడు. వికిపీడియాలో అత్యధిక మంది వీక్షించిన టాప్ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కోహ్లీ వికిపీడియా పేజీని ఇప్పటివరకు 43.3 మిలియన్ల మంది వీక్షించారు.
కోహ్లీని ట్విట్టర్‌లో 56.9 మిలియన్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 254 మిలియన్ల మంది, పేస్‌బుక్‌లో 51 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇండియాలో అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఇప్పుడు వికిపీడియాలోనూ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అయితే ఈ జాబితాలో ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సైతం వెనుబడి ఉండటం గమనార్హం.
కోహ్లీ తర్వాత ధోనీ 24.1 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా.. సచిన్ 23.6 మిలియన్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కోహ్లీ టీమిండియాలో బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత.. టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్నాడు. భారత జట్టు ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. బుధవారం నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చేందుకు కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. మరి వికిపీడియాలో కోహ్లీ రికార్డు గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ క్రికెటర్ మెచ్యూర్ అవడం నా లైఫ్‌లో చూడలేను: ధోని