iDreamPost
android-app
ios-app

VIDEO: కోహ్లీ ఫ్యాన్స్ యూ టర్న్.. ఈసారి రోహిత్​ కు సపోర్ట్ ఇస్తూ..!

  • Author Soma Sekhar Published - 06:21 PM, Mon - 13 November 23

నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఫ్యాన్స్ యూ టర్న్ తీసుకుని రోహిత్ కు మద్ధతు పలికారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కోహ్లీ ఫ్యాన్స్ ఏ విషయంలో రోహిత్ కు అండగా నిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం.

నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఫ్యాన్స్ యూ టర్న్ తీసుకుని రోహిత్ కు మద్ధతు పలికారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కోహ్లీ ఫ్యాన్స్ ఏ విషయంలో రోహిత్ కు అండగా నిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 06:21 PM, Mon - 13 November 23
VIDEO: కోహ్లీ ఫ్యాన్స్ యూ టర్న్.. ఈసారి రోహిత్​ కు సపోర్ట్ ఇస్తూ..!

వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ లో టీమిండియా దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పసికూన నెదర్లాండ్స్ పై 160 పరుగులు తేడాతో విజయం సాధించి.. ఘనంగా లీగ్ స్టేజ్ ను ముగించింది. ఇక ఈ గేమ్ లో తొలుత బ్యాటింగ్ లో చెలరేగిన టీమిండియా బ్యాటర్లు.. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా సత్తాచాటారు. అయితే ఈ మ్యాచ్ లో ఎన్నో వింతలు చోటుచేసుకున్నాయి. ఎన్నడూ చూడని విధంగా ఏకంగా 9 మంది ప్లేయర్లు బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ ఫ్యాన్స్ యూ టర్న్ తీసుకుని రోహిత్ కు మద్ధతు పలికారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కోహ్లీ ఫ్యాన్స్ ఏ విషయంలో రోహిత్ కు అండగా నిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియా-నెదర్లాండ్స్ మ్యాచ్ లో సరికొత్త ప్రయోగాలు చేసింది భారత్ టీమ్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో సత్తా చాటిన భారత బ్యాటర్లు.. ఆ తర్వాత బౌలింగ్ లో అదరగొట్టారు. ఈ మ్యాచ్ లో 9 మంది ప్లేయర్లు బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఐదురుగు రెగ్యూలర్ బౌలర్లు అయిన బుమ్రా,సిరాజ్, షమీ, జడేజా, కుల్దీప్ లతో పాటుగా.. విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తమలో బౌలర్ ను నిద్రలేపారు. కోహ్లీ 3 ఓవర్లు వేసి కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చి.. ఓ వికెట్ పడగొట్టగా.. గిల్ 2 ఓవర్లలో 11 రన్స్, సూర్య కుమార్ 2 ఓవర్లలో 17 పరుగులు సమర్పించుకున్నారు.
ఇక రోహిత్ శర్మ ఒకే ఓవర్ (5బాల్స్)వేసి 7 రన్స్ ఇచ్చి.. తేజా నిడమానురు వికెట్ పడగొట్టాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కు బౌలింగ్ ఇవ్వాలని, విరాట్ బౌలింగ్ వెయ్యాలని నినాదాలు చేసిన టీమిండియా ఫ్యాన్స్.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో యూ టర్న్ తీసుకుని రోహిత్ కు బౌలింగ్ వెయ్యాలని గట్టిగా అరిచారు. రోహిత్ యూ డూ బౌలింగ్.. మేమంతా మీతో ఉన్నాం అంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ అరుపులతో చిన్నస్వామి స్టేడియం మెుత్తం దద్దరిల్లిపోయింది.  ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇక ఫ్యాన్స్ కోరికమేరకు రోహిత్ బౌలింగ్ చేసి.. చివరి వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఈ మ్యాచ్ లో ఏకంగా తొమ్మిది మంది ప్లేయర్లు బౌలింగ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.