Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన ఘనత సాధించాడు కోహ్లీ. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన ఘనత సాధించాడు కోహ్లీ. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
Somesekhar
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన ఘనత సాధించాడు కోహ్లీ. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రేర్ ఫీట్ ను సాధించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ.. రికార్డుల రారాజుగా ప్రపంచ క్రికెట్ లో దూసుకెళ్తున్నాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రేర్ ఫీట్ ను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే సురేష్ రైనా పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో జానీ బెయిర్ స్టో క్యాచ్ పట్టడం ద్వారా కోహ్లీ ఈ నయా చరిత్రను లిఖించాడు. ఇప్పటి వరకు టీ20ల్లో 173 క్యాచ్ లు అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సురేష్ రైనా పేరిట ఉండేది. అతడు టీ20 క్రికెట్ లో 172 క్యాచ్ లు అందుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు కోహ్లీ.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు టీమ్ కు ఆదిలోనే షాకిచ్చాడు రబాడ. స్టార్ బ్యాటర్లు డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్ లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు. మరి విరాట్ కోహ్లీ సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
VIRAT KOHLI HAS TAKEN MOST CATCHES AS AN INDIAN FIELDER IN T20 CRICKET – 173*. pic.twitter.com/2N9ruhz0P9
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024
ఇదికూడా చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్! మెరుపు బౌలర్ ఎంట్రీ!