iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీ దూరం? కారణం అదేనట!

  • Published Mar 12, 2024 | 1:21 PM Updated Updated Mar 12, 2024 | 1:21 PM

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024కు దూరం కానున్నాడని సమాచారం. ఓ కారణం చేత బీసీసీఐ అతడిని పక్కనపెట్టాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024కు దూరం కానున్నాడని సమాచారం. ఓ కారణం చేత బీసీసీఐ అతడిని పక్కనపెట్టాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీ దూరం? కారణం అదేనట!

టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి ముందే టీమిండియాకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సర్జరీ చేయించుకున్న కారణంగా భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఈ మెగాటోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం ఈ టోర్నీకి దూరం కానున్నట్లు సమాచారం. దానికీ ఓ కారణం చెబుతోంది బీసీసీఐ. మరి నిజంగానే కోహ్లీ పొట్టి ప్రపంచ కప్ కు అందుబాటులో ఉండడా? దానికి బీసీసీఐ చెప్పే రీజన్ ఏంటి? ఓసారి పరిశీలిద్దాం.

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ 2024కు దూరం కానున్నట్లు సమాచారం. కోహ్లీని ఈ పొట్టి టోర్నీకి దూరంగా పెట్టాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. దానికి బీసీసీఐ ఓ బలమైన కారణాన్ని వెల్లడిస్తోంది. అసలు విషయం ఏంటంటే? జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరగనుంది. కాగా.. వెస్టిండీస్ లో స్లో పిచ్ లు ఉంటాయని, దానికి కోహ్లీ సూట్ కాడని బీసీసీఐ వాదన. ఈ కారణంతోనే అతడిని ఈ మెగాటోర్నీ నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు క్రీడా పండితులు వాదిస్తున్నారు.

ఇక ఈ విషయంలో కోహ్లీని ఒప్పించే బాధ్యతలను అజిత్ అగార్కర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ బౌలర్ మహ్మద్ షమీ దూరం కాగా.. ఇప్పుడు కోహ్లీ కూడా దూరమైతే.. టీమిండియాకు కష్టాలు తప్పవని అభిమానులతో పాటుగా క్రీడా వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. అదీకాక యంగ్ స్టర్లకు అవకాశాలు ఇవ్వాలిన కూడా మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లుగా సమాచారం. మరి స్లో వికెట్ పిచ్ లను కారణంగా చూపించి, బీసీసీఐ విరాట్ కోహ్లీని పక్కనపెట్టాని చూడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: తెలుగు RCB ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! RCB హోం గ్రౌండ్‌గా వైజాగ్‌?