iDreamPost
android-app
ios-app

గిల్​కు స్పాట్ పెడుతున్న కోహ్లీ.. యంగ్​ ఓపెనర్​కు ఇకపై కష్టమే!

  • Author singhj Published - 11:34 AM, Thu - 23 November 23

టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​కు స్పాట్ పెడుతున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. దీంతో ఇక అతడికి కష్టమేనని అంటున్నారు.

టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​కు స్పాట్ పెడుతున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. దీంతో ఇక అతడికి కష్టమేనని అంటున్నారు.

  • Author singhj Published - 11:34 AM, Thu - 23 November 23
గిల్​కు స్పాట్ పెడుతున్న కోహ్లీ.. యంగ్​ ఓపెనర్​కు ఇకపై కష్టమే!

విరాట్ కోహ్లీ.. క్రికెట్ లవర్స్​కు పరిచయం అక్కర్లేని పేరిది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైరవుతున్నప్పుడు అతడి రికార్డులను ఎవరైనా సాధించగలరా అనే డౌట్స్ అందరిలోనూ ఉండేవి. పరుగులు, సెంచరీల పరంగా అతడికి దగ్గరగా కూడా ఎవరూ రాలేరని అనుకున్నారు. కానీ సచిన్ మాత్రం టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తన రికార్డులను బ్రేక్ చేయగలరని ఓ సందర్భంలో అన్నాడు. ఆ మాటే నిజమైంది. 15 ఏళ్ల కెరీర్​లో ఎన్నో అద్భుతాలు చేశాడు కోహ్లీ. సచిన్ రెండున్నర దశాబ్దాల కెరీర్​లో సాధించిన చాలా రికార్డులను పదిహేనేళ్లలో బ్రేక్ చేసేశాడు విరాట్. సచిన్​ నుంచే గాక సుదీర్ఘ కాలం తనకు కెప్టెన్​గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని నుంచి పాఠాలేఉ నేర్చుకొని.. కోహ్లీ తనను తాను తీర్చిదిద్దుకున్న తీరు సూపర్ అనే చెప్పాలి. సచిన్ టెండూల్కర్​ను మించిన పరుగుల ప్రవాహంతో క్రికెట్ వరల్డ్​ను షాక్​కు గురిచేస్తున్నాడు కోహ్లీ.

వరల్డ్ కప్-2023లోనూ విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. మెగాటోర్నీలో చెలరేగి ఆడిన అతడు.. ఏకంగా 711 రన్స్ చేసి ప్రపంచ కప్ ఎడిషన్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. ఇదే టోర్నీలో సచిన్ 49 సెంచరీల రికార్డును కూడా బ్రేక్ చేసేశాడు. 50 సెంచరీలతో వన్డేల్లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడతను. దీంతో అతడి వారసుడు ఎవరు? కోహ్లీ లాంటి మరో ప్లేయర్ వస్తాడా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనికి భారత యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​ పేరును ఫ్యాన్స్ సమాధానంగా చెబుతున్నారు. గిల్ కూడా అందుకు తగ్గట్లే అద్భుతమైన ఆటతీరుతో తన సత్తా ఏంటో ఈపాటికే చాలా సార్లు చాటుకున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లో భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్​గా కంటిన్యూ అవుతున్నాడు గిల్. గత ఏడాది కాలంగా టీమిండియాలో టాప్ ఫామ్​లో ఉన్నవారిలో అతడు ముందు ప్లేసులో ఉన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లెవల్లో కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు.

ఇటీవల ముగిసిన వరల్డ్ కప్​లోనూ 346 రన్స్​ చేసి మరోమారు సత్తా చాటాడు గిల్. ఈ ఆటతీరు కారణంగానే వన్డే ర్యాంకింగ్స్​లో నంబర్ వన్ ప్లేస్​ అతడి సొంతమైంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి ర్యాంకింగ్స్​లో టాప్ ప్లేస్​ను దక్కించుకున్నాడు గిల్ (826). అతడి తర్వాతి ప్లేసులో కోహ్లీ (791), రోహిత్ (769) ఉన్నారు. అయితే గిల్ స్థానానికి విరాట్ స్పాట్ పెట్టినట్లే కనిపిస్తున్నాడు. ర్యాంకింగ్స్​లో వడివడిగా దూసుకొస్తున్న కోహ్లీ.. నెక్స్ట్ ఆడే సిరీస్​లో రాణిస్తే గిల్​ను అధిగమించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కన్​సిస్టెంట్​గా రన్స్ చేసే కింగ్ నుంచి తన ప్లేస్​కు ఉన్న ముప్పును గిల్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. కోహ్లీ వారసుడు అనిపించుకోవాలంటే అతడి నుంచి తన ర్యాంక్​కు ఉన్న ముప్పును ఫేస్ చేస్తూ.. శుబ్​మన్ మరింతగా రాణించాల్సి ఉంటుంది. మరి.. గిల్​కు కోహ్లీ స్పాట్ పెట్టడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అదే తప్పును రిపీట్ చేస్తున్న BCCI.. భారీ మూల్యం తప్పదా?