iDreamPost
android-app
ios-app

ప్రతి బాల్​కు ముందు ఆ మంత్రం తలచుకుంటా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Sep 18, 2024 | 6:12 PM Updated Updated Sep 18, 2024 | 6:12 PM

Virat Kohli Chant Om Namah Shivay Against Australia: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ సీక్రెట్స్​లో ఒకటి రివీల్ చేశాడు. తాను ఆడే సమయంలో పదే పదే ఆ మంత్రాన్ని తలచుకుంటానని చెప్పాడు.

Virat Kohli Chant Om Namah Shivay Against Australia: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ సీక్రెట్స్​లో ఒకటి రివీల్ చేశాడు. తాను ఆడే సమయంలో పదే పదే ఆ మంత్రాన్ని తలచుకుంటానని చెప్పాడు.

  • Published Sep 18, 2024 | 6:12 PMUpdated Sep 18, 2024 | 6:12 PM
ప్రతి బాల్​కు ముందు ఆ మంత్రం తలచుకుంటా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఒక్కో క్రికెటర్​కు ఒక్కో అలవాటు ఉంటుంది. తమకు ఏది అచ్చొస్తే దాన్ని అనుసరిస్తుంటారు.  బ్యాటర్లు అయితే గ్లౌవ్స్, ప్యాడ్స్ కట్టుకోవడంలో సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. దేవుళ్లను ఆరాధించే విషయంలోనూ వాళ్లలో ఇలాంటి నమ్మకాలను గమనించొచ్చు. కొందరు ఆటగాళ్లు తాము కొలిచే భగవంతుడి ఫొటోలకు దండం పెట్టాకే ఆడేందుకు వెళ్తారు. కీలక మ్యాచ్​లకు ముందు కొన్ని ఆలయాలను సందర్శించడం ఇంకొందరు ప్లేయర్లకు అలవాటు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కూడా ఓ సెంటిమెంట్ ఉందట. అతడి బ్యాటింగ్ సక్సెస్ సీక్రెట్స్​లో ఒకదాన్ని అతడు తాజాగా రివీల్ చేశాడు. తాను ఆడే సమయంలో ప్రతి డెలివరీకి ముందు ఓ మంత్రాన్ని తలచుకుంటానని తెలిపాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ఆడేస్తానని అన్నాడు. కోహ్లీ జపించే ఆ మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్​తో కలసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు కోహ్లీ. ఇందులో ప్రత్యేకంగా యాంకర్స్ ఎవరూ పాల్గొనలేదు. గౌతీ, కోహ్లీ ఇద్దరూ క్రికెట్​తో పాటు పర్సనల్ కెరీర్ గురించి ఒకర్నొకరు ప్రశ్నించుకుంటూ, వాటికి సమాధానాలు చెబుతూ కనిపించారు. ఈ సందర్భంగానే నీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా? బ్యాటింగ్ చేసే టైమ్​లో దేన్నయినా ఫాలో అవుతావా? అంటూ గంభీర్ అడిగాడు. దీనికి స్పందించిన కోహ్లీ.. బ్యాటింగ్ సమయంలో ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపిస్తానని తెలిపాడు. కఠిన సమయాల్లో దీన్ని ఎక్కువగా తలచుకుంటానని చెప్పాడు. 2014-15లో ఆస్ట్రేలియా టూర్​కు వెళ్లినప్పుడు ఈ మంత్రాన్ని అధికంగా ఉపయోగించానన్నాడు విరాట్.

2014లో ఆసీస్ టూర్​లో ప్రతి డెలివరీకి ముందు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించానన్నాడు కోహ్లీ. దీంతో కోచ్ గంభీర్ కూడా ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. తాను ‘హనుమాన్ చాలీసా’ ఎక్కువగా వింటానని తెలిపాడు. 2009లో నేపియర్​ టెస్ట్​ ఆడుతున్న టైమ్​లో వరుసగా రెండున్నర రోజుల పాటు ‘హనుమాన్ చాలీసా’ విన్నానని గౌతీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్, కెప్టెన్సీ గురించి కూడా కొత్త కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్​లో ఇంకా పరుగుల దాహం తీరలేదని.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్​గా కొనసాగాలనే ఆకలి అతడిలో ఇంకా ఉందన్నాడు. ఏళ్ల పాటు ఒకే రీతిలో ఆడుతూ కొత్త తరానికి కోహ్లీ స్ఫూర్తిగా నిలిచాడని.. అతడి లెగసీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యంగ్ జనరేషన్ మీద ఉందన్నాడు గంభీర్. బ్యాటర్​గానే గాక అగ్రెసివ్ కెప్టెన్​గా భారత క్రికెట్​పై కింగ్ వేసిన ముద్ర చెరపలేనిదని.. అది అందరు ఆటగాళ్లకు ఆదర్శమని మెచ్చుకున్నాడు.