iDreamPost
android-app
ios-app

ఆ IPL టీమ్​కు హెడ్ కోచ్​గా పాంటింగ్! కప్పు కల తీరుస్తాడా?

  • Published Sep 18, 2024 | 4:41 PM Updated Updated Sep 18, 2024 | 4:52 PM

Ricky Ponting Joins Punjab Kings As The New Head Coach: ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్​గా ఉన్న ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్​ను ఆ జట్టు రీసెంట్​గా తీసేసింది. హెడ్ కోచ్ పోస్ట్ నుంచి తొలగించి పంటర్​ను ఇంటికి సాగనంపింది డీసీ.

Ricky Ponting Joins Punjab Kings As The New Head Coach: ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్​గా ఉన్న ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్​ను ఆ జట్టు రీసెంట్​గా తీసేసింది. హెడ్ కోచ్ పోస్ట్ నుంచి తొలగించి పంటర్​ను ఇంటికి సాగనంపింది డీసీ.

  • Published Sep 18, 2024 | 4:41 PMUpdated Sep 18, 2024 | 4:52 PM
ఆ IPL టీమ్​కు హెడ్ కోచ్​గా పాంటింగ్! కప్పు కల తీరుస్తాడా?

ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ తిరిగి ఐపీఎల్​లోకి అడుగుపెట్టాడు. గత కొన్ని సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్​కు హెడ్ కోచ్​గా సేవలు అందించాడు పంటర్. అయితే ఐపీఎల్-2025కు ముందు అతడ్ని ఆ పోస్ట్​లో నుంచి తొలగించి ఇంటికి సాగనంపింది డీసీ. దీంతో పాంటింగ్ ఐపీఎల్ ఫ్యూచర్ సందిగ్ధంలో పడింది. ఈ కంగారూ దిగ్గజం మళ్లీ క్యాష్​ రిచ్ లీగ్​లో కనిపించడా? అని అభిమానులు ఆందోళన పడ్డారు. అతడి కోచింగ్ స్టైల్​, అగ్రెసివ్ అప్రోచ్​ను మిస్ అవుతామని బాధపడ్డారు. అయితే పాంటింగ్ షార్ట్ గ్యాప్​లోనే ఐపీఎల్​లోకి తిరిగొచ్చేశాడు. అతడ్ని ఓ టీమ్​ నూతన హెడ్ కోచ్​గా నియమించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. మరి.. పాంటింగ్​ను కోచ్​గా నియమించిన ఆ జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..

పంజాబ్ కింగ్స్ జట్టు పాంటింగ్​ను తమ నూతన హెడ్ కోచ్​గా నియమిస్తూ అఫీషియల్ అనౌన్స్​మెంట్ చేసింది. పంటర్ ఇప్పుడు పంజాబ్​లోకి వచ్చేశాడంటూ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్ వేదికగా ప్రకటించిందా ఫ్రాంచైజీ. వచ్చే సీజన్ నుంచి అతడు బాధ్యతలు చేపడతాడని తెలిపింది. అతడితో నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని పంజాబ్ కింగ్స్ స్పష్టం చేసింది. ఐపీఎల్-2028 వరకు పాంటింగ్ తమ టీమ్​కు కోచ్​గా ఉంటాడని పేర్కొంది. పంజాబ్ జట్టుకు పాంటింగ్​కు ముందు ఏడు సీజన్లలో కలిపి 5 మంది కోచ్​లు పని చేశారు. ఆ టీమ్ కోచింగ్ బాధ్యతలు​ చేపట్టనున్న ఆరో కోచ్​గా పంటర్ నిలవనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్​కు కొన్ని సీజన్ల పాటు కోచ్​గా సేవలు అందించాడీ ఈ కంగారూ లెజెండ్. రెండు నెలల కింద ఆ పోస్ట్ నుంచి డీసీ తీసేయగా.. ఇప్పుడు పంజాబ్​ కోచింగ్ బృందంలోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో చూపించాడు.

పంజాబ్ కింగ్స్ నయా హెడ్​ కోచ్​గా వచ్చిన పాంటింగ్ ముందు భారీ టార్గెట్ ఉంది. ఎందుకంటే ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది లేదు. ఐపీఎల్-2014లో రన్నరప్​గా నిలవడమే ఆ టీమ్ ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్. గత ఐపీఎల్​ సీజన్​లో పంజాబ్ పూర్తిగా నిరాశపర్చింది. ఏకంగా తొమ్మిదో స్థానంలో నిలిచి తమ అభిమానుల్ని కంప్లీట్​గా డిజప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్​గా పంటర్ నుంచి భారీగా ఎక్స్​పెక్ట్ చేస్తున్నారు. అటు ఫ్యాన్స్, ఇటు ఫ్రాంచైజీ అతడి మీద గంపెడాశలు పెట్టుకుంది. ట్రోఫీ సంగతి అటుంచితే టీమ్​ను కనీసం ప్లేఆఫ్స్​కు తీసుకెళ్లినా అదే పదివేలని భావిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్​ను ఒక టీమ్​లా సెట్ చేయగలిగితే చాలు అని ఆశిస్తున్నారు. గెలవగలమనే కసిని ఆటగాళ్లలో నింపి నడిపిస్తే బాగుంటుదని సూచిస్తున్నారు. మరి.. పాంటింగ్ పంజాబ్ కప్పు కలను తీరుస్తాడా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.