SNP
Virat Kohli, IPL 2024: ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటాడు. ఆర్సీబీకి తొలి విజయాన్ని అందించాడు. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడిన మాటలు అతనిలో ఎంత మార్పు వచ్చిందో చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, IPL 2024: ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటాడు. ఆర్సీబీకి తొలి విజయాన్ని అందించాడు. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడిన మాటలు అతనిలో ఎంత మార్పు వచ్చిందో చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్సీబీ బోణి కొట్టింది. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగడం, చివర్లో దినేష్ కార్తీక్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 77 పరుగులు చేసి కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న తర్వాత, కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డులు, స్టాట్స్, నంబర్స్, అచీవ్‌మెంట్స్ అన్నీ ముఖ్యంగా కాదు, కొన్నేళ్లు గడిచిన తర్వాత మనం వీటి గురించి మాట్లాడుకోం.. ప్రేమాభిమానాలు, మెమొరీస్, స్నేహం మాత్రం మిగిలిపోతాయి, రాహుల్ ద్రవిడ్ కూడా ఇదే చెప్పారు.’ అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
అయితే.. విరాట్ కోహ్లీ అంటే అంతా చాలా అగ్రెసివ్ ప్లేయర్ అని, సెంచరీలు సాధించాలనే తపన, పరుగులు చేయాలనే ఉత్సాహం, పరుగుల దాహంతో ఉంటాడనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కోహ్లీ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా అలానే ఉన్నాడు. రన్స్ చేయాలి, మ్యాచ్ గెలవాలనే కసి కోహ్లీ కళ్లలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే.. కొడుకు పుట్టాక కోహ్లీలో చాలా మార్పు వచ్చినట్లు అతని మాటలు బట్టి అర్థం అవుతుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. బంధం, ప్రేమ, అనురాగం గురించి కోహ్లీ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడని, ఇప్పుడు కోహ్లీ క్రికెట్ రికార్డుల కంటే కూడా ఫ్యామిలీతో గడిపే సమయమే ఎక్కువగా ఇష్టం ఉన్నట్లు తెలుస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమైన కోహ్లీ.. వారుసుడి రాక సమయంలో భార్య అనుష్క పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్నా.. అతని మనసు మొత్తం అక్కడే ఉంది. ఈ క్రమంలోనే కోహ్లీ నుంచి ఇలాంటి వేదాంతపు మాటలు వస్తున్నాయని క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఉంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెప్టెన్ ధావన్ 45, ప్రభుసిమ్రాన్ 25, జితేష్ శర్మ 27, సామ్ కరన్ 23, శశాంక్ సింగ్ 21 పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ 2, మ్యాక్స్‌వెల్ 2 వికెట్ల పడగొట్టారు. ఇక 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీకి కోహ్లీ కళ్లు చెదిరే స్టార్ట్ ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే అవుటై అయ్యే ప్రమాదం నుంచి బయటపడి.. ఏకంగా నాలుగు బౌండరీలు బాదాడు. డుప్లెసిస్, గ్రీన్, మ్యాక్స్‌వెల్ విఫలైమనా.. 77 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో దినేష్ కార్తీక్ 10 బంతుల్లో 28, మహిపాల్ లోమోర్ 8 బంతుల్లో 17 రన్స్ చేసి ఆర్సీబీకి సంచలన విజయం అందించారు. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 రన్స్‌చేసిన ఆర్సీబీ గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శనతో పాటు అతను చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kohli said “At the end of the day, you don’t talk about achievements, stats or numbers but the memories, that is what Rahul Dravid says – the love, friendship, appreciation”. pic.twitter.com/BrtZ5eq06W
— Johns. (@CricCrazyJohns) March 25, 2024