iDreamPost
android-app
ios-app

మనం ఏది చేస్తే.. మనకు అదే జరుగుతుంది! కోహ్లీ విషయంలో అదే నిజమైంది!

  • Author singhj Published - 09:41 PM, Fri - 20 October 23

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి బాగా వినిపిస్తోంది. మనం ఏం చేస్తే అదే జరుగుతుందని విరాట్ ఫ్యాన్స్ అంటున్నారు. అసలు కోహ్లీకి కర్మ థియరీకి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి బాగా వినిపిస్తోంది. మనం ఏం చేస్తే అదే జరుగుతుందని విరాట్ ఫ్యాన్స్ అంటున్నారు. అసలు కోహ్లీకి కర్మ థియరీకి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 09:41 PM, Fri - 20 October 23
మనం ఏది చేస్తే.. మనకు అదే జరుగుతుంది! కోహ్లీ విషయంలో అదే నిజమైంది!

కర్మ సిద్ధాంతం గురించి వినే ఉంటారు. మన దేశంలో దీన్ని కోట్లాది మంది విశ్వసిస్తారు. సనాతన ధర్మంలో పాటించే కొన్ని ప్రధాన నమ్మకాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. మహాభారత యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడికి గీత బోధిస్తూ కర్మ సిద్ధాంతం ప్రస్తావన కూడా తీసుకొస్తాడు. కర్మ​ అంటే ఏంటో కాదు.. మనం చేసే పనులే. మనం మంచి చేస్తే తిరిగి మనకు మంచి జరుగుతుంది. ఒకవేళ చెడు చేస్తే తిరిగి చెడు జరుగుతుందనేదే కర్మ సిద్ధాంతం. అందుకే ఎవరికీ చెడు చేయకూడదని.. ఒకవేళ చెడు చేస్తే దాని పర్యవసానాలు కూడా అనుభవించాల్సి వస్తుందని పెద్దలు హెచ్చరిస్తుంటారు. బతికినన్ని రోజులు ఎవరికీ హాని తలపెట్టకుండా, మంచి చేస్తూ బతకాలని సూచిస్తుంటారు.

కర్మ సిద్ధాంతం గురించి ఇంత ఉపోద్ఘాతం ఇప్పుడెందుకు అంటారా? టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కర్మ సిద్ధాంతంతో సంబంధం ఉన్నట్లే కనిపిస్తోంది. ఈ వరల్డ్‌ కప్​లో కోహ్లీ ఫుల్ ఫామ్​లో కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడి టీమ్​ను గెలిపించాడు కింగ్. ఆ తర్వాత ఆఫ్ఘానిస్థాన్​​ పైనా కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్​తో గురువారం జరిగిన నాలుగో మ్యాచ్​లో ఏకంగా సెంచరీ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్​లో విరాట్ సెంచరీ సాధించడం కష్టంగానే అనిపించింది. చేయాల్సిన రన్స్ తక్కువగా ఉండటం, అవతల కేఎల్ రాహుల్ క్రీజులో ఉండటంతో మ్యాచ్ త్వరగా ముగుస్తుందని అంతా అనుకున్నారు.

వరల్డ్ కప్​లో నెట్ రన్​ రేట్ కూడా కీలకం కాబట్టి బంగ్లాతో మ్యాచ్​ను భారత్ త్వరగా ఫినిష్ చేస్తుందనిపించింది. కోహ్లీ కూడా తన సెంచరీ కంటే టీమ్ గెలుపే ముఖ్యమని భావించాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం సెంచరీ పూర్తి చేయాల్సిందేనని పట్టు పట్టడంతో కింగ్ మనసు మార్చుకొని శతకంపై ఫోకస్ పెట్టాడు. కొట్టాల్సిన రన్స్, సెంచరీకి చేరుకునేందుకు అవసరమైన రన్స్​ను పక్కా క్యాలిక్యులేట్ చేసుకొని మూడంకెల స్కోరును అందుకున్నాడు. అయితే విరాట్ సెంచరీకి కర్మ సిద్ధాంతానికి ముడిపెడుతున్నారు భారత ఫ్యాన్స్. దీనికి ఐపీఎల్-2011లో జరిగిన ఓ ఘటనను గుర్తుచేస్తున్నారు. ఆ సీజన్​లో ఆర్సీబీ టీమ్​లో కోహ్లీతో కలసి ఆడాడు లెజెండ్ క్రిస్ గేల్.

ఐపీఎల్-2011లో కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ తరఫున గేల్ ఓపెనింగ్ చేశాడు. ఈ మ్యాచ్​లో క్రిస్ గేల్ (102 నాటౌట్), విరాట్ కోహ్లీ (30 నాటౌట్) అద్భుతంగా ఆడటంతో కేకేఆర్ విసిరిన 171 రన్స్ టార్గెట్​ను 18.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేజ్ చేసేసింది బెంగళూరు. అయితే ఈ మ్యాచ్​లో ఒక టైమ్​లో గేల్ సెంచరీ పూర్తి చేస్తాడా అనేది డౌట్​గా మారింది. కానీ గేల్ కోసం కోహ్లీ కొన్ని బాల్స్​ను కొట్టకుండా డిఫెండ్ చేశాడు. ఆ టైమ్​లో కేకేఆర్ బౌలర్లు ఒకట్రెండు వైడ్స్ వేయడంతో వారిపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఎట్టకేలకు కోహ్లీ సపోర్ట్​తో ఆ మ్యాచ్​లో గేల్ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు. ఇప్పుడు వరల్డ్ కప్​-2023లో బంగ్లాపై విరాట్ సెంచరీ బాదాడు. కోహ్లీకి ఇంట్రెస్ట్ లేకపోయినా కేఎల్ రాహుల్ పట్టుబట్టి, సింగిల్స్ తీయకుండా, పూర్తి స్ట్రయిక్ కింగ్​కు వచ్చేలా చేశాడు. దీంతో కోహ్లీ సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి ఐపీఎల్​ మ్యాచ్​ను గుర్తు చేస్తూ గేల్​కు విరాట్ సాయం చేశాడని.. ఇప్పుడు కోహ్లీకి రాహుల్ హెల్ప్ చేశాడని అందుకే సెంచరీ పూర్తయిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గేల్​కు కోహ్లీ చేసిన మంచి ఇప్పుడు పనికొచ్చిందని.. కింగ్ విషయంలో కర్మ సిద్ధాంతం నిజమైందని చెబుతున్నారు. మరి.. కోహ్లీ విషయంలో ఫ్యాన్స్ కర్మ సిద్ధాంతం ప్రస్తావన తీసుకురావడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: KL రాహుల్‌ ప్లేస్‌లో శార్ధుల్‌ ఠాకూర్‌! క్లారిటీ ఇచ్చిన రోహిత్‌ శర్మ