iDreamPost
android-app
ios-app

ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ!

  • Author Soma Sekhar Published - 04:45 PM, Wed - 15 November 23

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోసారి సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాలు..

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోసారి సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాలు..

  • Author Soma Sekhar Published - 04:45 PM, Wed - 15 November 23
ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ!

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. గ్రూప్ దశలో సూపర్ ఫామ్ ను కొనసాగించిన భారత ఆటగాళ్లు అదే ప్రదర్శనతో సెమీఫైనల్లో కివీస్ ను ఓ ఆటాడుకుంటున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు చెలరేగుతున్నారు. ఫస్ట్ రోహిత్ సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. ఆ తర్వాత గిల్ రెచ్చిపోయి ఆడాడు. ఇక ఈ మెగాటోర్నీలో అదరగొడుతూ.. లీడింగ్ స్కోరర్ గా ఉన్న కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాట్ కు పనిచెప్పాడు. తాజాగా జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ బౌలర్లను ఎదుర్కొంటూ.. అర్ధసెంచరీ సాధించి.. సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సచిన్ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.

వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. కివీస్ బౌలర్లపై ఆది నుంచే ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సులు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 రన్స్ చేసి సౌథీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికే తొలి వికెట్ కు 8 ఓవర్లలో 71 పరుగులు జోడించారు రోహిత్-గిల్ జోడీ. రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కింగ్ విరాట్ కోహ్లీ.. తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ.. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. గిల్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన కోహ్లీ.. అర్ధసెంచరీ సాధించి శతకం వైపు దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో 79 రన్స్ వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ సాధించడం ద్వారా ఇప్పటి వరకు ఎవ్వరికీ సాధ్యం కాని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 2003 వరల్డ్ కప్ లో 7 అర్ధశతకాలు బాది తన పేరిట వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. తాజాగా ఈ రికార్డును బద్దలు కొట్టాడు కోహ్లీ. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో కోహ్లీ ఆడిన 10 మ్యాచ్ ల్లో 6 అర్దశతకాలు, 2 సెంచరీలు బాదాడు. దీంతో ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ గా విరాట్ నిలిచాడు. ఇక ఈ లిస్ట్ లో షకీబ్(7, 2019 వరల్డ్ కప్), రోహిత్ శర్మ(6, 2019 వరల్డ్ కప్) లు ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 34 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 247 రన్స్ చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ(80), శ్రేయస్ అయ్యర్(38) బ్యాటింగ్ చేస్తున్నారు. మరి సచిన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.