వరల్డ్ కప్ లో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మరోసారి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. మరి ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ లో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మరోసారి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. మరి ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ.. వరల్డ్ కప్ 2023లో తన విశ్వరూపం చూపించాడు. అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. జట్టును ప్రపంచ కప్ ఫైనల్ వరకూ చేర్చాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా అర్ధశతకంతో రాణించాడు విరాట్ కోహ్లీ. కానీ జట్టుకు మాత్రం వరల్డ్ కప్ అందించడంలో విఫలం అయ్యాడు. వరల్డ్ కప్ తుదిపోరులో ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమిని చవిచూసి.. కోట్ల మంది భారతీయులను నిరాశకు గురిచేసింది. అయితే ఓటమి బాధలో ఉన్న ఫ్యాన్స్ కు కాస్త ఊరటనిచ్చే విషయం.. విరాట్ కోహ్లీ మరోసారి సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ.. క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఆ ఘనతకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
వరల్డ్ కప్ ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన టీమిండియా.. టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచింది. ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోయి.. భారతీయుల కలలను కల్లలుగానే మిగిల్చింది. ఇక ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మెగాటోర్నీలో దుమ్మురేపుతూ.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాడు రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. వరుసగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డులతో పాటుగా ఇతర దిగ్గజాల రికార్డులను సైతం బద్దలు కొడుతూ వచ్చాడు విరాట్. అసాధ్యం అనుకున్న సచిన్ 50 సెంచరీల ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు కోహ్లీ.
తాజాగా మరో ఘనతను సాధించి.. రికార్డుల్లోకి ఎక్కాడు కోహ్లీ. సచిన్ సాధించిన మరో రికార్డును బద్దలు కొట్టాడు ఈ టీమిండియా స్టార్ బ్యాటర్. ఈ ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ తన బ్యాట్ తో ఏ రేంజ్ లో సత్తాచాటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 11 మ్యాచ్ ల్లో మూడు సెంచరీలతో సహా.. 90.31 సగటుతో 765 పరుగులు బాదాడు కోహ్లీ. టోర్నమెంట్ లో అత్యధిక పరుగులతో నిలిచిన కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ లభించింది. కాగా.. ఇది కోహ్లీ కెరీర్ లో 21వ అవార్డు కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో 21 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలు గెలిచిన తొలి ప్లేయర్ గా చరిత్రకెక్కాడు విరాట్ భాయ్.
ఇక ఇప్పటి వరకు ఈ ఘనత సచిన్ పేరిట ఉండేది. అతడు 183 సిరీస్ ల్లో 20 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలు గెలవగా.. కోహ్లీ కేవలం 157 సిరీస్ ల్లో 21 అవార్డులు గెలిచాడు. ఈ విషయం తెలిసిన కొహ్లీ ఫ్యాన్స్ కొంత ఊరట చెందుతున్నారు. ఓటమిలోనూ మరో ఘనత సాధించిన విరాట్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే వరల్డ్ కప్ కిందికి ఏ అవార్డు రాదని మనందరికి తెలిసిన విషయమే అని సగటు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో వీరిద్దరి తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ 17 అవార్డులతో మూడో స్థానంలో, జాక్వెస్ కల్లీస్ 15 అవార్డులతో నాలుగో ప్లేస్ లో ఉన్నారు. మరి ఓటమిలోనూ విరాట్ కోహ్లీ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Most Player of the Series awards in International cricket::
Virat Kohli – 21* (157 series)
Sachin Tendulkar – 20 (183 series) pic.twitter.com/vN6qX4zXbf
— Johns. (@CricCrazyJohns) November 20, 2023