iDreamPost
android-app
ios-app

Virat Kohli: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్!

  • Published Mar 30, 2024 | 9:10 AM Updated Updated Mar 30, 2024 | 9:10 AM

కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్, ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్, ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Virat Kohli: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్!

ఐపీఎల్ 2024 సీజన్ లో టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తున్నాడు. తాజాగా కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో సైతం ఫిఫ్టీతో మెరిశాడు. ఈ మ్యాచ్ లో ఇతర ప్లేయర్ల నుంచి కావాల్సినంత సహకారం లభించకున్నా.. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసి చివరి వరకు క్రీజ్ లో నిలిచాడు. ఈ క్రమంలోనే విండీస్ విధ్వంసక వీరుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు విరాట్ భాయ్. ఆ వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ లో ఓ బ్రాండ్. రికార్డులకు పర్యాయపదంగా విరాట్ పేరును వాడుతూ ఉంటారు. అంతలా అతడి డామినేషన్ ప్రపంచ క్రికెట్ పై కొనసాగుతోంది. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో సైతం దుమ్మురేపుతున్నాడు ఈ రన్ మెషిన్. మూడు మ్యాచ్ ల్లో రెండు అర్ధశతకాలతో మెరిసిన విరాట్ భాయ్, ఈ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించి.. ఆరెంజ్ క్యాపర్ గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు కోహ్లీ. ఈ క్రమంలోనే విండీస్ దిగ్గజం, మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో సిక్స్ కొట్టడం ద్వారా ఐపీఎల్ లో అత్యధిక సిక్సులు బాదిన ఆర్సీబీ ఆటగాడిగా విరాట్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్ లో 4 సిక్సులు కొట్టిన కోహ్లీ.. ఓవరాల్ గా ఆర్సీబీ తరఫున 241 సిక్సులు బాదాడు. ఇంతకు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. ఈ యునివర్సల్ బాస్ ఆర్సీబీ తరఫున 239 సిక్సులు కొట్టాడు. ఆ తర్వాత ఏబీడీ 238 సిక్సులతో మూడో ప్లేస్ ఉన్నాడు. కాగా.. ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు. ఈ మ్యాచ్ లో విరాట్ 59 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సులతో 83 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. కానీ 7 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచికొట్టింది. మరి క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేసిన రన్ మెషిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: RCB vs KKR పోరులో ఇది గమనించారా? మ్యాచ్ కే హైలెట్..