SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అతనికిదే తొలి మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. అయితే.. కోహ్లీ సర్ఫరాజ్‌కు దండం పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అతనికిదే తొలి మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. అయితే.. కోహ్లీ సర్ఫరాజ్‌కు దండం పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో మ్యాచ్‌తో సర్ఫరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళి క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తూ.. డొమెస్టిక్ డాన్ బ్రాడ్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న అతనికి చాలా కాలం నిరీక్షణ తర్వాత గురువారం టీమిండియా క్యాప్ ధరించాలనే అతని కల నెలవేరింది. ఈ క్షణాల కోసం ఇన్నాళ్లు ఎంత కసిగా వేచి చూశాడో.. ఆ కసినంతా తన బ్యాటింగ్‌లో చూపించాడు సర్ఫరాజ్ ఖాన్. టెస్ట్‌ల్లో వన్డే తరహా బ్యాటింగ్ స్టైల్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే తొలి మ్యాచ్ ఆడుతూ.. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. లేకుంటే.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదేలా కనిపించాడు.
తన డెబ్యూ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ చూపించిన ఇంటెంట్, అతని బ్యాటింగ్ స్టైల్‌కు క్రికెట్ అభిమానులంతా ఫిదా అయిపోయారు. తొలి మ్యాచ్ ఆడుతున్న ఒత్తిడి ఏ మాత్రం లేకుండా, ఎంతో అద్భుతంగా ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాడు. ముఖ్యంగా అతని స్ట్రైక్‌రేట్ గురించి మాట్లాడుకోవాలి. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ లాంటి ప్లేయర్లు అవుటైన పిచ్‌పై అగ్రెసివ్ ఇంటెంట్‌తో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, జడేజా చేసిన పొరపాటు వల్ల సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే.. 99 పరుగుల వద్ద ఉన్న జడేజా కోసం సర్ఫరాజ్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. లేకుంటే.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి.. మరింత సక్సెస్‌ను చూసేవాడు. అయితే.. సర్ఫరాజ్ టాలెంట్ ఇప్పుడే కాదు.. చాలా ఏళ్ల క్రితమే టీమిండియా సూపర్‌స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గుర్తించాడు.
సర్ఫరాజ్ బ్యాటింగ్ విధ్వంసం చూసి.. ఏకంగా కోహ్లీ అంతటోడే ఒంగి మరి దండం పెట్టాడు. ఈ ఘటన 2015లో చోటు చేసుకుంది. ఐపీఎల్ 2015 సీజన్ సందర్భంగా ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ ఆ మ్యాచ్‌లో 200 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఒక్క పరుగుకే అవుటైనా.. డివిలియర్స్, సర్ఫరాజ్ మెరుపులు మెరిపించినడంతో భారీ స్కోర్ దక్కింది. నాటౌట్‌గా నిలిచి ఇన్నింగ్స్ ముగించి తిరిగి వస్తున్న సర్ఫరాజ్‌కు సూపర్‌గా ఆడావంటూ.. కోహ్లీ ఒంగి మరీ దండం పెట్టాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మరి కోహ్లీ లాంటోడే సర్ఫరాజ్‌కు దండం పెట్టడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.