SNP
Virat Kohli, Dinesh Karthik, RCB vs GT: గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన తర్వాత.. దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ మధ్య అరుదైన ఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
Virat Kohli, Dinesh Karthik, RCB vs GT: గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన తర్వాత.. దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ మధ్య అరుదైన ఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తా చాటింది. ఈ విజయంతో.. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలర్లు సమిష్టింగా రాణించడం, ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ బ్యాటింగ్‌తో గుజరాత్ చిత్తుగా ఓడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత.. మరోసారి కోహ్లీ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. సీజన్‌లో అత్యధిక పరుగులతో లీడింగ్‌లో ఉన్న ప్లేయర్‌కు ఈ ఆరెంజ్ క్యాప్ ఇస్తారనే విషయం తెలిసిందే.
సీజన్ ఆరంభం నుంచి ఆరెంజ్ క్యాప్ కోహ్లీ వద్దే ఉంది. కానీ, కోహ్లీతో రుతురాజ్ గైక్వాడ్ సైతం ఈ ఆరెంజ్ క్యాప్ కోపం పోటీ పడుతున్నాడు. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ కంటే ముందు ఈ క్యాప్ రుతురాజ్ వద్ద ఉంది. అయితే.. రుతురాజ్‌తో కేవలం 9 పరుగులు వెనుకబడిన కోహ్లీ.. గుజరాత్‌తో మ్యాచ్‌లో 42 పరుగులు చేసి.. రుతురాజ్‌ను దాటేసి.. ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి దక్కించుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్సీబీ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఈ క్యాప్‌ను కోహ్లీకి బహూకరించాడు. డీకే క్యాప్ పెడుతున్న క్రమంలో కోహ్లీ డీకేకు బో డౌన్ చేసి.. నవ్వులు పూయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ కంటే డీకే సీనియర్ క్రికెటర్ అనే విషయం తెలిసిందే. కోహ్లీ సరదాగా చేసినా.. ఒక సీనియర్ ప్లేయర్‌కు కోహ్లీ ఇచ్చిన గౌరవానికి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. గుజరాత్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్ 37, డేవిడ్ మిల్లర్ 30, రాహుల్ తెవాటియా 35 పరుగులు చేసి రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాళ్, వైశాఖ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కామెరున్ గ్రీన్, కరణ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. 148 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసేసింది. ఓపెనర్లు డుప్లెసిస్, కోహ్లీ తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించి విజయం ఖాయం చేశారు. చివర్లో దినేష్ కార్తీక్ 21, స్వప్నిల్ సింగ్ 15 పరుగులు చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. మరి ఈ మ్యాచ్ తర్వాత డీకేకే కోహ్లీ బోడౌన్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli bowing down to Dinesh Karthik after receiving the Orange Cap. 👌
– Video of the day….!!!!pic.twitter.com/AP4OEzgqbv
— Johns. (@CricCrazyJohns) May 4, 2024